బీజేపీలోకి జయప్రద

బీజేపీలోకి జయప్రద

Updated On : March 25, 2019 / 7:29 AM IST

మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద పార్టీ మారుతున్నారు. బీజేపీలోకి వెళుతున్నారు. అమర్ సింగ్ శిష్యురాలిగా ఉన్న ఆమె.. ఇప్పటికే రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2019, మార్చి 25వ తేదీ సాయంత్రం లేదా 26వ తేదీ అమిత్ షా సమక్షంలో పార్టీలో జాయిన్ కాబోతున్నారు.
యూపీ ప్రజలకు జయప్రద సుపరిచితురాలు. పదేళ్లు ఎంపీగా ఉన్నారు. ములాయంసింగ్ యాదవ్ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. పార్టీ పగ్గాలు అఖిలేష్ యాదవ్ చేతిలోకి వచ్చిన తర్వాత అమర్ సింగ్ ప్రాబల్యం తగ్గింది. దీంతో జయప్రద కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. యూపీలో ఎస్సీ-బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. కీలక నేతలకు వల వేస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే జయప్రదతో సంప్రదింపులు జరిపింది బీజేపీ. అయితే పార్టీ ప్రచారానికే పరిమితం అవుతారా లేక ఎంపీగా బరిలోకి దిగుతారా అనేది చూడాలి. బీజేపీ వర్గాలు మాత్రం పోటీకి దించుతాం అని అంటున్నారు. రాంపూర్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దించనున్నట్లు స్థానిక నేతలు అంటున్నారు. అధిష్టానం మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు.