Jayaprakash Narayan: అప్పుల పాలవుతారు, మరింత పేదలవుతారు- భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించడంపై జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు..

ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఖర్చు చేయడానికి అస్సలు వెనుకాడరు. తాము జరిపించే పెళ్లి గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలని ఆశపడే వారూ ఉన్నారు.

Jayaprakash Narayan: అప్పుల పాలవుతారు, మరింత పేదలవుతారు- భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించడంపై జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు..

Updated On : March 17, 2025 / 7:48 PM IST

Jayaprakash Narayan: భారత్ లో పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరిపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు ఖర్చు చేస్తారు. కొందరు లక్షలు వెచ్చిస్తే, మరికొందరు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. డబ్బునోళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు.

పెళ్లిని ఎంత గ్రాండ్ గా జరిపిస్తే అంతగా తమ స్టేటస్ పెరుగుతుందని భావించే వారూ ఉన్నారు. ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఖర్చు చేయడానికి అస్సలు వెనుకాడరు. తాము జరిపించే పెళ్లి గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలని ఆశపడే వారూ ఉన్నారు.

అయితే, పెళ్లిళ్లకు భారీగా ఖర్చు పెట్టడంపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా చేయడం వల్ల పేదలు మరింత పేదలు అవుతారని, మధ్య తరగతి వారు అప్పుల పాలవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. వివాహాలకు భారీగా ఖర్చు చేయడం.. ఉత్పాదకత లేని, వృధా ఖర్చులకు దారితీస్తుందన్నారు.

Also Read : టీచర్స్ చేతిలో బెత్తం ఉండనివ్వండి.. పిల్లలు కంప్లెయింట్ చేయగానే అరెస్ట్ చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక ఆర్డర్స్

”ఒక సంవత్సరంలో దాదాపు 10 మిలియన్ల జంటలు వివాహాలను జరుపుకుంటారు. ఒక అంచనా ప్రకారం సగటు ఖర్చు దాదాపు 1 మిలియన్ (10 లక్షలు) అని తెలుస్తోంది. వాస్తవ ఖర్చు బహుశా పేదలకు 2 లక్షల ఉండొచ్చు. అదే సంపన్నులకు 2 కోట్ల వరకు ఉంటుంది. సూపర్ రిచ్‌లు దీనికి మరెన్నో రెట్లు ఖర్చు చేస్తారు. మనం వివాహాల కోసం సంవత్సరానికి 10 ట్రిలియన్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. అది మన GDPలో దాదాపు 3శాతం.

దీనికి ప్రభుత్వాన్ని నిందించలేము. దీనికి పరిష్కారం మన దగ్గరే ఉంది. పెళ్లికి చేసే ఖర్చులో ఎక్కువ భాగం ఆదా చేసి, ఉత్పాదక ఆస్తులను సంపాదించడానికి లేదా ఇల్లు లేదా వ్యాపారాన్ని నిర్మించడానికి తిరిగి ఉపయోగించినట్లయితే, వారి భవిష్యత్తు మరింత సురక్షితంగా ఉంటుంది. అలాగే సమాజం ప్రయోజనం పొందుతుంది.

ఇది మన జీవితాలను మార్చగల, పేదరికాన్ని అంతం చేయగల చర్య. వివాహాలకు భారీగా ఖర్చు చేసే ఆచారాన్ని మనం మార్చుకోవాలి. వివాహం అనేది ఆర్థిక సమస్యలకు, దివాలా తీయడానికి మూలం కాకుండా ఉండాలి. మన భవిష్యత్తును నిర్మించడానికి ఆనందకరమైన సందర్భంగా ఉండాలి” అని జయప్రకాశ్ నారాయణ ఆకాంక్షించారు.