Kerala High Court : టీచర్స్ చేతిలో బెత్తం ఉండనివ్వండి.. పిల్లలు కంప్లెయింట్ చేయగానే అరెస్ట్ చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక ఆర్డర్స్

ఎలాంటి దురుద్దేశం లేకుండా చిన్న శిక్షలు విధించినందుకు టీచర్లను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించాలని న్యాయమూర్తి పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు.

Kerala High Court : టీచర్స్ చేతిలో బెత్తం ఉండనివ్వండి.. పిల్లలు కంప్లెయింట్ చేయగానే అరెస్ట్ చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక ఆర్డర్స్

Updated On : March 17, 2025 / 6:29 PM IST

Kerala High Court : తమను కొట్టారనో, తిట్టారనో టీచర్స్ పై పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ తరహా కేసులకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

టీచర్స్ చేతిలో బెత్తం ఉండనివ్వాలంది. పిల్లలు కంప్లెయింట్ చేయగానే పోలీసులు టీచర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేసి వారిని అరెస్ట్ చేయొద్దు అంటూ కీలక ఆర్డర్స్ ఇచ్చింది కేరళ హైకోర్టు. క్రిమినల్ కేసు నమోదు చేయడానికన్నా ముందు ప్రాథమిక విచారణ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

ఒక విద్యా సంస్థలో ఏదైనా నేరానికి పాల్పడినందుకు ఉపాధ్యాయుడిపై క్రిమినల్ ఫిర్యాదును కొనసాగించే ముందు ప్రాథమిక విచారణ జరపాలని కేరళ హైకోర్టు ఇటీవల పోలీసులను ఆదేశించింది.

ఎటువంటి దురుద్దేశం లేకుండా చిన్న శిక్షలు విధించినందుకు టీచర్లను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించాలని న్యాయమూర్తి పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఒక నెలలోపు సర్క్యులర్ జారీ చేయాలని రాష్ట్ర పోలీసు చీఫ్‌ను ఆదేశించింది న్యాయస్థానం.

Also Read : దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థల పాత్రపై పాడ్‌కాస్ట్‌లో మోదీ ఏమన్నారంటే?

మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ.. ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షార్హమైన నేరాలకు, ప్రాథమిక కేసు ఉందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించవచ్చని BNSS సెక్షన్ 173(3)ని కోర్టు ప్రస్తావించింది. విద్యాసంస్థ లోపల వారి కార్యకలాపాలకు సంబంధించి ఉపాధ్యాయుడిపై వచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేయడానికి ముందు సెక్షన్ 173(3) ప్రకారం ప్రాథమిక విచారణ నిర్వహించాలంది.

ప్రాథమిక విచారణ సమయంలో, అవసరమైతే ఉపాధ్యాయుడికి నోటీసు ఇవ్వొచ్చంది. కానీ ఆ సమయంలో వారిని అరెస్ట్ చేయరాదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో మరింత స్పష్టత అవసరమైతే రాష్ట్రం లేదా పోలీసు అధికారులు కోర్టును సంప్రదించవచ్చని సూచించింది.

పిల్లాడిని కొట్టాడని అరెస్ట్ అయిన టీచర్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. బెత్తంతో దాడి చేశాడని పిల్లాడు కంప్లెయింట్ ఇవ్వడంతో పోలీసులు ఆ టీచర్ ని అరెస్ట్ చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 118 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం లేదా తీవ్రంగా గాయపరచడం), జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలోని సెక్షన్ 75 (పిల్లల పట్ల క్రూరత్వానికి శిక్ష) కింద అతనిపై నేరాలు నమోదు చేయబడ్డాయి. కాగా, తనపై వచ్చిన ఆరోపణను టీచర్ తిప్పికొట్టారు. బాగా చదువుకోవాలని చెప్పానని, అతడిని సరిదిద్దడానికి మాత్రమే ప్రయత్నించానని, అంతకుమించి వేరే ఉద్దేశ్యం లేదని వాదించారు.

ఉపాధ్యాయులు క్రిమినల్ ప్రాసిక్యూషన్ బెదిరింపులో ఉన్నారని, అందువల్ల వారు విద్యార్థుల ప్రవర్తన లేదా క్రమశిక్షణ విషయాలలో ఎటువంటి చర్య తీసుకోరని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లలను సరిదిద్దే ప్రయత్నంలో, క్రమశిక్షణలో భాగంగా టీచర్లు కొట్టారని బాధపడకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. టీచర్లు తమ చేతిలో బెత్తం తీసుకెళ్లడానికి కూడా అనుమతి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.