Jet Airways founder : నరేష్ గోయల్ విచారణలో వెలుగుచూసిన దిమ్మతిరిగే వాస్తవాలు

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ విచారణలో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న ఈ కేసులో నిందితుడు నరేష్ గోయల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ముంబయి పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది....

Jet Airways founder : నరేష్ గోయల్ విచారణలో వెలుగుచూసిన దిమ్మతిరిగే వాస్తవాలు

Jet-Airways-founder-Naresh

Updated On : September 3, 2023 / 8:49 AM IST

Jet Airways founder : జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ విచారణలో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న ఈ కేసులో నిందితుడు నరేష్ గోయల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ముంబయి పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 538 కోట్ల మేరకు బ్యాంక్ మోసం కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ దుబాయ్, యూకేతో సహా విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. (Jet Airways founder diverted bank loan funds)

Delhi : ఢిల్లీ ప్రజలు 61 కోట్ల మద్యం బాటిళ్లు తాగారు…సర్కారుకు రూ.7.285 కోట్ల ఆదాయం

ఎర్నెస్ట్ అండ్ యంగ్స్ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్స్ సూచించిన విధంగా నరేష్ గోయల్ అక్రమంగా రుణాన్ని మళ్లించారని, దీనివల్ల కెనరా బ్యాంక్‌కు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ తెలిపింది. (buy property overseas) జెట్‌ ఎయిర్‌వేస్‌ అనుబంధ సంస్థలు, ఇతర నిందితులతో కుమ్మక్కై కెనరా బ్యాంకు రుణాల సొమ్మును బోగస్ ఖర్చులు చూపించి మోసగించాడని తేలింది. ప్రొఫెషనల్, కన్సల్టెన్సీ ఖర్చుల కింద నరేష్ గోయల్ 1,000 కోట్ల రూపాయల సందేహాస్పదమైన ఖర్చులను బుక్ చేసినట్లు ఈడీ కనుగొంది.

Leopard Death : యూపీ సఫారీ పార్కులో చిరుతపులి మృతిపై విచారణ

ఈ ఖర్చుల్లో నరేష్ గోయల్, అతని కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖర్చులు, అలాగే ప్రమోటర్ల విదేశీ ఖాతాలకు జమ చేసిన లెక్కలు చూపని లావాదేవీలు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్ దుబాయ్, ఐర్లాండ్, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌ దేశాలలో ఉన్న విదేశీ సంస్థలకు జనరల్ సెల్లింగ్ ఏజెంట్స్ కమీషన్ రూపంలో నిధులను మళ్లించింది.

Odisha : ఒడిశాలో పిడుగుపాటుకు 10 మంది మృతి

చార్టర్డ్ అకౌంటెంట్లు, కన్సల్టెంట్‌లకు అధికంగా చెల్లింపులు చేశారు. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఆడిట్‌ నివేదికను పరిశీలించగా నరేష్‌ గోయల్‌ భార్య అనిత, కుమార్తె నమ్రత, కుమారుడు నివాన్‌లకు 2011-2012, 2018-2019 సంవత్సరాల్లో జిఐఎల్‌ ఖాతాల నుంచి రూ.9.46 కోట్లు చెల్లించినట్లు వెల్లడైంది.