Delhi : ఢిల్లీ ప్రజలు 61 కోట్ల మద్యం బాటిళ్లు తాగారు…సర్కారుకు రూ.7,285 కోట్ల ఆదాయం
దేశ రాజధాని ప్రజల్లో ఎక్కువ మంది మందుబాబులా? అంటే అవునంటోంది తాజాగా వెలుగుచూసిన మద్యం విక్రయాల నివేదిక. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వతేదీ వరకు 2022-23 ఎక్సైజ్ సంవత్సరంలో ఢిల్లీల 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించారని తేలింది....
liquor
Delhi : దేశ రాజధాని ప్రజల్లో ఎక్కువ మంది మందుబాబులా? అంటే అవునంటోంది తాజాగా వెలుగుచూసిన మద్యం విక్రయాల నివేదిక. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వతేదీ వరకు 2022-23 ఎక్సైజ్ సంవత్సరంలో ఢిల్లీల 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించారని తేలింది. (Delhi government sold over 61 crore liquor bottles) అంటే ఈ మద్యం విక్రయాల ద్వారా ఢిల్లీ సర్కారుకు రూ.7, 285 కోట్ల ఆదాయం వచ్చింది. (earned 7,285 crore last year) ఈ మద్యం విక్రయాలపై రూ.2,013.44 కోట్ల విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వసూలు అయింది.
Leopard Death : యూపీ సఫారీ పార్కులో చిరుతపులి మృతిపై విచారణ
ఢిల్లీ మద్యం పాలసీపై గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా వెలుగుచూసిన మద్యం విక్రయాల నివేదిక చూస్తే దిమ్మతిరుగుతోంది. 2021-22లో కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఆదాయం రూ. 5,487.58 కోట్లు వచ్చింది. రిటైల్ మద్యం అమ్మకాలలో ప్రైవేట్ పార్టీలు పాల్గొనే కొత్త ఎక్సైజ్ పాలసీని గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జి) వీకే సక్సేనా పాలసీ అమలులో అవకతవకలపై సీబిఐ విచారణకు సిఫారసు చేశారు.
Odisha : ఒడిశాలో పిడుగుపాటుకు 10 మంది మృతి
2021-22 ఎక్సైజ్ పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో అప్పటి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. గత ఏడాది ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఢిల్లీ కన్స్యూమర్స్ కోఆపరేటివ్ హోల్సేల్ స్టోర్, ఢిల్లీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ నగరం అంతటా 600 పైగా రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించింది.
