Jharkhand: హాస్పిటల్ ఇన్‌స్పెక్షన్‌లో మంత్రి.. బయట ఆవరణలో కొవిడ్ పేషెంట్ మృతి

జార్ఖండ్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు కారణంగా బెడ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఓ కొవిడ్ పేషెంట్‌ను ..

Jharkhand: హాస్పిటల్ ఇన్‌స్పెక్షన్‌లో మంత్రి.. బయట ఆవరణలో కొవిడ్ పేషెంట్ మృతి

Jharkhand Covid Patient Dies Outside Hospital

Updated On : April 15, 2021 / 8:18 AM IST

Jharkhand: జార్ఖండ్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు కారణంగా బెడ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఓ కొవిడ్ పేషెంట్‌ను హజారిబాగ్ ప్రాంతం నుంచి రాంచీకి బెటర్ ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు. అదే సమయంలో మంత్రి పేషెంట్లకు జరుగుతున్న ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ చేసేందుకు హాస్పిటల్ కు వచ్చారు.

బయటనిల్చొన్న రోగి బంధువులు సహాయం కావాలని.. డాక్టర్లు అర్థిస్తున్నా పట్టించుకోకపోవడంతో అక్కడే మృతి చెందాడు. తాము ఉదయమే హాస్పిటల్ కు వచ్చామని ఒక్కరూ కూడా పట్టించుకోలేదని గంటల కొద్దీ సమయం ఎండలో వెయిట్ చేసిన తర్వాత పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడని రోగి కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఎట్టకేలకు లోపలికి తీసుకెళ్లేసరికి అప్పటికే రోగి మరణించినట్లు డాక్టర్లు తేల్చారు. డెడ్ బాడీని తీసుకుని బయటకు వస్తున్న సమయంలో మంత్రి కూడా బయటకు వస్తుండటంతో బాధిత కుటుంబ సభ్యులు ఏర్పాట్లు లేవంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు అందించడంలో విఫలం అవుతున్నారంటూ కేకలు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి గారూ.. మేం డాక్టర్ల కోసం అరుస్తూనే ఉన్నాం. ఎవ్వరూ మా తండ్రికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. హాస్పిటల్ లో అడ్మిషన్ కోసం బయటే నిల్చొని ఉన్నాం. ఒక్కరు కూడా అటెండ్ చేయించుకోలేదు. చివరికి ట్రీట్మెంట్ అందక ఆయన ప్రాణాలు కోల్పోయాడు’ అని రోగి కూతురు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మంత్రి చనిపోయిన వ్యక్తిని తీసుకురాగలడా అంటూ ప్రశ్నించింది. కేవలం ఓట్లు కోసమే వస్తారు కానీ, బాధలు పట్టించుకోరు. పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ట్రీట్మెంట్ అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆరోపించింది. సమస్యలు ఉన్న చోట అవి లేకుండా చేయడానికే ప్రయత్నిస్తున్నామని మంత్రి అన్నారు.

ప్రతి రోజూ కొవిడ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ కొవిడ్ పేషెంట్ల కోసం 50శాతం కేటాయించాలని ఆదేశించాం. పొరబాట్లు ఉన్న చోట వాటిని సరిదిద్దుకోవడానికే ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి చెప్పారు.