Bihar Politics: నితీశ్-తేజశ్వీలకు ఝలక్.. మంత్రి పదవికి రాజీనామా చేసిన సంతోష్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు

Bihar Politics: నితీశ్-తేజశ్వీలకు ఝలక్.. మంత్రి పదవికి రాజీనామా చేసిన సంతోష్ కుమార్

Updated On : June 13, 2023 / 2:15 PM IST

Santosh Kumar Suman: బిహార్ రాష్ట్రంలోని నితీశ్ కుమార్ – తేజశ్వీ యాదవ్‭లకు మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ షికాచ్చారు. తన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. సంతోష్ రాజీనామాతో ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వ కూటమి నుంచి హిందుస్తాన్ ఆవామ్ మోర్చా (హెచ్ఏఏం) పార్టీ వైదొలగినట్లైనా అనే అనుమానాలు వస్తున్నాయి. హెచ్ఏఏం పార్టీని జనతాదళ్ యూనియన్ పార్టీలో కలపాలనే ధోరణిలో నితీశ్ కుమార్ వ్యవహరిస్తున్నరని, అందుకే ప్రభుత్వం నుంచి వైదొలగినట్లు రాజీనామా అనంతరం సంతోష్ తెలిపారు.

Kuchadi Srihari Rao : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు.. మోసం చేశారని ఆవేదన

జూన్ 23న నిర్వహించే విపక్షాల సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదట. అదే రాజీనామా వరకు దారి తీసింది. ఈ విషయమై సంతోష్ స్పందిస్తూ ‘‘మేము (హెచ్ఏఏం పార్టీ) కూటమిలో ఉన్నట్లు వాళ్లు (నితీశ్, తేజశ్వీ) భావించడం లేదు. ఏ విషయంలోనూ మమ్మల్ని గుర్తించడం లేదు. విపక్ష కూటమి సమావేశానికి మమ్మల్ని పిలవనే లేదు. మాకు మేముగా మమ్మల్ని ఆహ్వానించారని ఎలా అనుకుంటాం?’’ అని అన్నారు. ‘‘అడవిలో అనేక జంతువులు ఉంటాయి. పులులు ఇతర జంతువుల్ని వేటాడుతాయి. అన్ని తప్పించుకోవాలి. మేము కూడా తప్పించుకోవాలి’’ అని ఆయన అన్నారు.

Kothakota Dayakar Reddy : మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

అయితే తిరిగి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేతో కలుస్తున్నారానే అనే ప్రశ్నలకు లేదని సంతోష్ సమాధానం చెప్పారు. ‘‘మాది స్వతంత్రమైన పార్టీ. ముందు మా పార్టీ ఉనికి గురించి మేము ఆలోచించాలి’’ అని అన్నారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని అన్నారు.

Supreme Court Comments : అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత మహా కూటమిలో చేరారు. దీంతో సుమన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న నితీశ్.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. బిహార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరికి సంతోష్ తన రాజీనామా లేఖను సమర్పించారు.