‘కశ్మీర్‌లో డర్టీ పిక్చర్లు చూడటానికే ఇంటర్నెట్’

‘కశ్మీర్‌లో డర్టీ పిక్చర్లు చూడటానికే ఇంటర్నెట్’

Updated On : January 19, 2020 / 7:32 AM IST

కశ్మీర్ ప్రజలకు ఇంటర్నెట్ ఆపేయడమే కాకుండా అక్కడ కేవలం డర్టీ పిక్చర్లు (బూతు సినిమాలు) చూడటానికే వాడతారనే విమర్శలు చేశాడు నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్. కశ్మీర్ వెళ్లడానికి రాజకీయ నాయకులు ఎందుకు అంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ధీరూభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వార్షికోత్సవంలో భాగంగా గాంధీనగర్‌లో పాల్గొని మాట్లాడారు. 

కశ్మీర్, ఢిల్లీ రోడ్లపై మళ్లీ ఆందోళనలు సృష్టించాలని చూస్తున్నారు. వీటికి సోషల్ మీడియా ఆజ్యం పోస్తుంది. అయినా ఇంటర్నెట్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులేందటి. అక్కడ ఇంటర్నెట్‌తో ఏం వాడతారు. అంత లాభాలు వచ్చేసేంత పని అక్కడేం జరుగుతుంది. కేవలం డర్టీ పిక్చర్లు(బూతు సినిమాలు) చూడటం కోసమే వాడుతున్నారు’ 

‘కశ్మీర్‌లో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఏ మాత్రం నష్టాలు రావు. కశ్మీర్‌లో ఇంటర్నెట్ మూసేయడానికి వేరే కారణం ఉంది. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత అక్కడ ఇంటర్నెట్ పనిచేస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగే అవకాశం ఉంది. అందుకే అక్కడ కర్ఫ్యూ, రాజకీయ నాయకుల పర్యటనను నిషేదం, కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపేయడం’ జరిగాయి. 

జమ్మూ కశ్మీర్ లో శనివారం 2జీ మొబైల్ డేటా సర్వీసులు నిబంధనలు ఎత్తేశారు. అది కూడా కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే అనుమతి దక్కింది. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఇంటర్నెట్ సేవలు వర్తించడం లేదు. బడ్గం, గాందేర్‌బల్, బరాముళ్ల, శ్రీనగర్, కుల్గం, అనంతనాగ్, షోపియన్, పుల్వామా ప్రాంతాల్లో ఇంకా ఇంటర్నెట్ సేవలు బంద్ లోనే ఉన్నాయి.