Shehla Rashid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మోదీ, అమిత్ షాలపై షేలా రషీద్ ప్రశంసలు

మోదీ ప్రభుత్వాన్ని కొనియాడడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పిటిషనర్ల జాబితా నుంచి తన పేరును ఉపసంహరించుకున్న అనంతరం పొగడ్తలు కురిపించారు.

Shehla Rashid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మోదీ, అమిత్ షాలపై షేలా రషీద్ ప్రశంసలు

Updated On : October 14, 2023 / 7:26 PM IST

Israel Palestine Conflict: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ భారత సైన్యం, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై జవహర్‌లాల్ నెహ్రూ మాజీ విద్యార్థి నాయకురాలు షేలా రషీద్ ప్రశంసలు కురిపించారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే భారతీయులుగా మనం ఎంత అదృష్టవంతులమో ఈరోజు అర్థమవుతోందని ఆమె అన్నారు.

భారత సైన్యం, భద్రతా బలగాలు మన భద్రత కోసం సర్వస్వం త్యాగం చేశాయని షెహ్లా రషీద్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అన్నారు. కశ్మీర్‌లో శాంతి నెలకొల్పినందుకు వారికి ఆ గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇండియన్ ఆర్మీ, చినార్ కార్పస్‌లను ట్యాగ్ చేశారు.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: గాజాకు మద్దతిస్తాం, వాళ్లేమడిగినా ఇస్తాం.. బెంగాల్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

షెహ్లా రషీద్ 2016లో జెఎన్‌యులో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కేసులో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్‌లతో పాటు ఆమె పేరు రావడంతో వార్తల్లోకి వచ్చింది. ఇది కాకుండా, 2019 లో సాయుధ దళాలు ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయని, కశ్మీర్‌లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై కేసు నమోదైంది. అయితే మోదీ ప్రభుత్వంపై బీజేపీపై ఒంటి కాలి మీద లేచే షెలా రషీద్.. ఉన్నట్టుండి పొగడ్తలు కురిపించడం చర్చీనీయాంశం అవుతోంది.

అయితే మోదీ ప్రభుత్వాన్ని కొనియాడడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పిటిషనర్ల జాబితా నుంచి తన పేరును ఉపసంహరించుకున్న అనంతరం పొగడ్తలు కురిపించారు. జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల సమస్యలు క్షీణించాయని, పరిపాలన మెరుగుపడిందని, ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు దోహదపడిందని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: Transgender Community: పాటలు పాడక్కర్లేదు, డాన్స్ చేయక్కర్లేదు.. ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లు గౌరవంగా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు