Udaipur : తన చావుకి భార్య, స్నేహితురాలు కారణమంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకున్న జర్నలిస్ట్

ఉదయ్‌పూర్‌లో స్ధానిక జర్నలిస్ట్ భరత్ మిశ్రా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, స్నేహితురాలి కారణంగా తను చనిపోతున్నట్లు ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి చనిపోవడం సంచలనం రేపింది.

Udaipur : తన చావుకి భార్య, స్నేహితురాలు కారణమంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకున్న జర్నలిస్ట్

Udaipur

Udaipur : ఉదయ్‌పూర్‌లో భరత్ మిశ్రా అనే జర్నలిస్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, స్నేహితురాలి కారణంగానే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Nitin Desai : బాలీవుడ్ స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. షాక్ లో బాలీవుడ్..

రాజస్ధాన్ ఉదయ్‌పూర్ జిల్లాకి చెందిన 45 ఏళ్ల భరత్ మిశ్రా ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం కలిగించింది. తన మరణానికి తన భార్య, తన స్నేహితురాలు ఇద్దరు కారణం అంటూ సోషల్ మీడియాలో సూసైడ్ నోట్ పోస్ట్ చేసి తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. గోవర్ధన్ విలాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన స్నేహితురాలు బిన్సీ పరేరా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Maharashtra : భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న పోలీసు అధికారి

భరత్ మిశ్రా ఆత్మహత్యకు ముందు స్నేహితురాలు పరేరాతో ఫోన్‌లో గొడవ పడినట్లు తెలుస్తోంది. నా జీవితంలో భార్య కౌశల్య, స్నేహితురాలు బిన్సీ పరేరా గందరగోళం సృష్టించినందుకు తాను చనిపోతున్నానంటూ వారిని బాధ్యులను చేస్తూ ఫేస్ బుక్‌లో భరత్ మిశ్రా పోస్ట్ పెట్టాడు. అతని మరణంపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.