SAI ట్రయల్స్‌లో పాల్గొనను – శ్రీనివాసగౌడ

  • Published By: madhu ,Published On : February 16, 2020 / 06:33 PM IST
SAI ట్రయల్స్‌లో పాల్గొనను – శ్రీనివాసగౌడ

Updated On : February 16, 2020 / 6:33 PM IST

SAI నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనడం లేదని కంబాలా జాకీ శ్రీనివాస గౌడ తెలిపారు. SAI ట్రాక్ ఈవెంట్‌ కోసం ట్రయల్స్‌లో పాల్గొనాలని కిరణ్ రిజిజు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసక్తి లేదని, కంబాలాపై దృష్టి సారిస్తానని చెప్పారు. కంబాలా రేసులో పాల్గొన్న తనను అందరూ అభినందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.

ఓ జాతీయ పత్రికతో ఆయన మాట్లాడారు. SAI నిర్వహించే ట్రయల్స్‌లో మాత్రం పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. అయితే..2020, ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం సీఎం యడియురప్పను బెంగళూరులో కలుస్తానని తెలిపారు. 

కంబాలా రేసులో కాలి మడమలు కీలకం అని, కానీ ట్రాక్‌లో పాదాలు కీలకమన్నారు. కంబాలా రేసులో జాకీలు మాత్రమే..కాదు..ఎద్దులు పాత్ర ఉంటుందని..ట్రాక్ రేసులో ఇలా ఉండదన్నారు. 15 సంవత్సరాల వయస్సులోనే పొలం పనులు చేపట్టాడు. వందలాది కంబాలా ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు. అయితే…కంబాలా నుంచి ఎంత సంపాదిస్తున్నాడనే దానిపై చెప్పలేదు. తనకు మాత్రం సరిపోతుందని శ్రీనివాస గౌడ తెలిపారు. కంబాలాలో చాలా మంది పాల్గొంటారని, కానీ కొంతమంది విజయం సాధించలేరన్నారు. 

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తిన కర్నాటకకి చెందిన శ్రీనివాస గౌడపై అందరి దృష్టి నెలకొంది. బురద నీటిలో వేగంగా పరుగెత్తిన ఇతడిని భారత్ ఉసేన్ బోల్ట్ అని అంటున్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో..చాలా మంది స్పందించారు. ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్ర..ట్వీట్ చేశారు.

అతడి శరీర దారుఢ్యాన్ని చూడండి..అథ్లెటిక్స్‌లో విజయాలు సాధించే..అసాధారణ సామర్థం ఉందని, అందుకే అతడికి 100 మీటర్ల స్ప్రింట్‌లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా కిరణ్ రిజిజు చూడాలన్నారు ఆనంద్ మహీంద్ర. దీనికి మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. శ్రీనివాసను శాయ్‌కు పిలిపించడం జరుగుతుందని వెల్లడించారు. SAI నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కానీ శ్రీనివాసగౌడ కంబాలా రేసుపైనే దృష్టి పెడుతానని అంటున్నారు. 
Read More : తెలంగాణ కేబినెట్ సమావేశం..పూర్తి వివరాలుకాకతీయ కాలువలో కొట్టుకొచ్చిన కారులో రెండు మృతదేహాలు!