Karnataka Election Result 2023: కర్ణాటకలో గెలుపెవరిది? మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత .. ఓట్ల లెక్కింపు జరిగేది ఎక్కడంటే..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12గంటల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?.. హంగ్ ఏర్పడే అవకాశం ఉందా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Karnataka Election Result 2023: కర్ణాటకలో గెలుపెవరిది? మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత .. ఓట్ల లెక్కింపు జరిగేది ఎక్కడంటే..?

Karnataka Election Result

Updated On : May 13, 2023 / 7:07 AM IST

Karnataka Polls: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు ప్రచారం కొనసాగింది. అయితే, జేడీఎస్ ఈ పోరులో మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ఫలితాల సమయంలో ఆ పార్టీ కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇవ్వాళ జరిగే కౌంటింగ్ ప్రక్రియలో 2,615 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఏడాది 73.19 శాతం రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. గతంకంటే ఓటింగ్ శాతం పెరగడంతో ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ, ఎగ్జిట్స్ పోల్స్ మాత్రం హంగ్‌ వైపు ఎక్కువశాతం మొగ్గు చూపాయి.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో ముందున్న గ్రామీణం.. అతి ఎక్కువ ఓట్ శాతం, అతి తక్కువ ఓట్ శాతం వచ్చిన నియోజకవర్గాలు ఏవో తెలుసా?

8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరిగిన విషయం విధితమే. అయితే, ఈరోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా  34 జిల్లాల్లో 36చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగళూరులో నాలుగు చోట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కింపు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 306 హాళ్లను ఏర్పాటు చేయగా, 4,256 ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్ గదికి 10 నుంచి 18 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 13, 309 మంది అధికారులు, సిబ్బంది పాల్గోనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మూడు అంచెల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది, హంగ్ వచ్చే అవకాశం ఉందా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తిస్థాయి ఫలితాలు సాయంత్రం 6గంటల వరకు వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Karnataka Polls: హంగ్‭పై కుమారస్వామి ఓవర్ కాన్ఫిడెన్స్.. ఫలితాలు రాకముందే కాంగ్రెస్, బీజేపీలకు సైగలు

గెలుపుపై ఎవరి ధీమా వారిదే..

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమేనంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 130 సీట్లు ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా మాదే విజయం అని చెప్పాయని, ఫలితంగా అధికారంలోకి వచ్చేది మేమేనని ఆ పార్టీ నేతలు దీమాతో ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. 120 సీట్లకుపైగా నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని బీజేపీ పేర్కొంటుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అధికారంలోకి రావాలంటే 113 స్థానాల్లో విజయం సాధించి ఉండాలి.

Karnataka Elections 2023: ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకున్నాం: జేడీఎస్

జేడీఎస్ కీలకంగా మారుతుందా?

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న జేడీఎస్ మరోసారి కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సైతం అధికంగా ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. ఈ విషయంపై జేడీఎస్ నేతలు మాట్లాడుతూ.. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని ఇప్పటికే నిర్ణయించామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే జేడీఎస్ అగ్రనాయకత్వంలో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర నాయకులతో కుమారస్వామి చర్చిస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.