బీజేపీ ఎమ్మెల్యే సూసైడ్ అంటెప్ట్

కర్నాటక : బీజేపీ ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం రాష్ట్రంలో కలకలం రేగింది. ఏకంగా పీఎస్ ఎదుటే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించడం..పోలీసులు అతడిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వేధిస్తున్నారని..అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారంట. హోసదుర్గ ఎమ్మెల్యేగా గూలిహట్టి శేఖర్ బీజేపీ నుండి విజయం సాధించారు. ఈయన జనవరి 06వ తేదీ ఆదివారం హోసదుర్గ పీఎస్ దగ్గరకు తన అనుచరులతో వచ్చి ఆందోళన చేపట్టారు. తన అనుచరులను పోలీసులు అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని…ఇసుక అక్రమ రవాణా కేసుల్లో ఇరికిస్తున్నారంటూ గూలిహట్టి శేఖర్ వాపోయారు. ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించిన ఆయన….ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. దీనిని గమనించిన పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. అనంతరం గూలిహట్టి శేఖర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.