ఫుల్లుగా తాగి.. KGF పాటలు పాడుతూ కూతుర్ని సుత్తితో
కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ అనే వ్యక్తి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ అనే వ్యక్తి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫుల్లుగా తాగిన వ్యక్తి తాను ఆ కూతురికి తండ్రి అనే సంగతి మర్చిపోయాడు. కేజీఎఫ్ సినిమా పాటలు పాడుతూ రెచ్చిపోయి కూతురి చెయ్యి మీద సుత్తితో కొట్టాడు. కర్ణాటకటలోని హస్సాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ అనే వ్యక్తి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రశాంత్ ఓ కాఫీ ఎస్టేట్ కు యజమాని. అతనికి ఇద్దరు కూతుళ్లు. కొడుకు పుట్టలేదని రోజూ కూతుళ్లను కొడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతను కొడుతుండగా ఒక కూతురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేసింది. ఈ వీడియో వైరల్ గా మారి కన్నడ సంఘాలు ఆ వ్యక్తిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఇటువంటి ఘటనే ఇటీవల గురుగ్రామ్ లోనూ జరిగింది. భార్య గొంతుపై కత్తి ఉంచి భర్తే సుత్తితో కొట్టాడు. ప్రేమ్ పూరీ అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో అశోక్ అనే వ్యక్తి చేతిలో వీరా అనే మహిళ చనిపోయింది. భార్యభర్తల గొడవ పక్కింటి వారికి వినిపిస్తున్నప్పటికీ హత్యకు దారి తీస్తుందనుకోకపోవడంతో ఊరకుండిపోయమని వెల్లడించారు.