Priyanka Gandhi Vadra : సిమ్లా జహు హనుమాన్ దేవాలయంలో ప్రియాంకా గాంధీ ప్రత్యేక పూజలు
ర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంకా గాంధీ సిమ్లాలోని జహు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు పూజలు చేసిన తరువాత ధ్యానంలో ప్రియాంకా గాంధీ కూర్చున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Priyanka Gandhi at Shimla's Jakhu temple
Priyanka Gandhi : కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ దే విజయం అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కర్ణాటకలో ఓట్ల లెక్కింపులో ఫలితాల్లో హస్తం పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంకా గాంధీ సిమ్లాలోని జహు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు పూజలు చేసిన తరువాత ధ్యానంలో ప్రియాంకా గాంధీ కూర్చున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మొదటి రౌండ్ ఫలితాలకే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా ఆ నంబర్ ను కాంగ్రెస్ దాటేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిస్తున్న క్రమంలో కాంగ్రెస్ కు గెలుపు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణాదిలో పట్టు కోసం బీజేపీ ఉవ్విళూరుతోంది. కాంగ్రెస్ మాత్రం దక్షిణాదిలో అయినా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోరులో కర్ణాటకలో విజయం రెండింటికి కీలకంగా మారింది.
కర్ణాటకలో ఫలితాలు వెలుబడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా సిమ్మాలోని జహు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ విజయం సాధించాలని కోరుకున్నారు. భారతదేశం, కర్ణాటక ప్రజల శాంతి, సామరస్యం కోసం ప్రియాంకా గాంధీ ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offers prayers at Shimla’s Jakhu temple pic.twitter.com/PRH47u36Zm
— ANI (@ANI) May 13, 2023
224 స్థానాలు ఉన్న కర్ణాటకలో.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 115 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 115 సీట్లు వచ్చిన పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 75-80 మధ్యలో ఉంది. ఇక జేడీఎస్ 26 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.