karnataka : నెమలిని పెంచుకుంటున్న వ్యక్తి..చిలుక జోస్యం చెప్పే ఏడురుగురు అరెస్ట్
నెమళ్లను పెంచుకుంటున్న వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస..చిలుక జోస్యం చెప్పే ఏడురుగురు అరెస్ట్

Karnataka Man Arrested For Raising Peacocks
karnataka man arrested for raising peacocks : మన భారత దేశం జాతీయ పక్షి నెమలి. అందుకే నెమలిని వేటాడటం..నేరం. అంతేకాదు అందంగా ఉంటుంది కదాని..నెమలిని పెంచుకోవటం కూడా నేరమే. నెమలిని పెంచుకోవటం చట్టవిరుద్ధం కాబట్టి ఎవరైనా నెమళ్లను పెంచుతున్నారంటూ అధికారులు రంగంలోకి దిగుతారు. ఈక్రమంలో కర్ణాటకలో ఓ వ్యక్తి నెమలిని పెంచుకుంటున్నాడని తెలిసి మంజూ నాయక్ అనే వ్యక్తిని వ్యక్తిని అరెస్ట్ చేశారు అటవీ శాఖ పోలీసులు.
కామేగౌడనహల్లి గ్రామంలోని తన నివాసంలో మంజూ నాయక్ నెమళ్లను పెంచుతున్నాడన్న సమాచారంతో అధికారులు వెంటనే రంగంలోకి ది మంజూనాయక్ ను అరెస్టు చేశారు. అతని ఇంటినుంచి ఓ పెద్ద నెమలిని స్వాధీనం చేసుకున్నారు. భారత వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం నెమళ్లు రక్షిత జంతువుల జాబితాలో ఉంటాయి. వాటిని వేటాడటం, హింసించడం, ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పెంచుకోవడం వంటివి నేరంగా పరిగణించబడతాయి. నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా నెమలిని పెంచుతున్న మంజూ నాయక్ పై కేసు పెట్టి అరెస్టు చేశామని.. కోర్టు రిమాండ్ మేరకు జైలుకు తరలించామని కర్ణాటక అటవీ శాఖ ప్రకటించింది.
అలాగే వన్య ప్రాణుల చట్టం ప్రకారం రామ చిలుకలు కూడా రక్షిత జంతువులే. ఇటీవల ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్ ఓ చిలుక జోస్యుడి వద్ద జోస్యం చెప్పించుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పెట్టారు. అది చూసిన పెటా సంస్థ కర్ణాటకలోని చెంగల్పట్టులో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. రక్షిత జంతువులైన రామ చిలుకలను జోస్యం పేరిట బంధించి హింసిస్తున్నారని పేర్కొంది. దీనిపై స్పందించిన చెంగల్పట్టు అటవీ అధికారులు దాడులు చేసి ఏడుగురు చిలక జోస్యులను అరెస్టు చేశారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం..
దేశంలోని వన్య ప్రాణులు అంతరించిపోకుండా కాపాడేందుకు..వాటిని సంరక్షించేందుకు 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. కొన్ని వన్య మృగాలను వేటాడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధించింది. ఈ చట్టాన్ని 2002లో సమరించారు. పర్యావరణ భద్రత కోసం వన్య మృగాలు, పక్షులు, మొక్కలను సంరక్షించటం ఈ చట్టం యొక్క ఉద్ధేశం. ఈ చట్టం ద్వారా ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ మండలిని ఏర్పాటు చేస్తారు.