కాలం కలిసొచ్చింది : ఆ రైతును ఉల్లి కోటీశ్వరుడిని చేసింది

  • Published By: madhu ,Published On : December 15, 2019 / 01:27 PM IST
కాలం కలిసొచ్చింది : ఆ రైతును ఉల్లి కోటీశ్వరుడిని చేసింది

Updated On : December 15, 2019 / 1:27 PM IST

ఉల్లి వినియోగదారులను కంటతడిపెట్టిస్తోంది. ఉల్లి రైతులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఉల్లిగడ్డ కొనాలంటేనే వామ్మో అంటున్నారు. ఎందుకంటే ధరలు అలా ఉన్నాయి మరి. రూ. 100కు పైగా ఎకబాకుతోంది. కానీ ఓ ఉల్లి ధర మాత్రం ఓ రైతును కోటీశ్వరుడిని చేసింది. మీరు నమ్మలేకున్నా ఇది నిజం. ధరలు పెరగడం వల్ల ఆ ఇంట్లో లాభాల పంట పండింది. తాను చేస్తున్న ఈ వ్యాపారం ఇప్పుడు కలిసి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన డబ్బుతో ఓ ఇళ్లు..కొంత భూమి కొంటానంటున్నాడు ఆ రైతు. 

కర్నాటక చిత్రదుర్గ జిల్లాలోని దొడ్డసిద్దవ్వహళ్లికి చెందిన మల్లిఖార్జున్ రైతు ఏన్నో సంవత్సరాలుగా ఉల్లి పంటను పండిస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈసారి కూడా భారీ ఎత్తున ఉల్లి సాగు చేశాడు. పది ఎకరాలతో పాటు మరో పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేశాడు. దాదాపు వంద మంది కూలీలు పొలంలో పనిచేస్తున్నారు. రూ. 15 లక్షలు పెట్టుబడిన దానికంటే..రూ. 5 నుంచి రూ. 10 లక్షల లాభం వస్తుందని ఆశించాడు.

ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో ఇతనికి కాలం కలిసివచ్చినట్లైంది. గతంలో క్వింటాల్ కేవలం వందల్లో పలికితే..ఇప్పుడు రూ. 15 వేలకు పైగానే పలికింది. 240 టన్నుల ఉల్లిపాయలను 20 ట్రక్కుల ద్వారా వివిధ రాష్ట్రాలకు దిగుమతి చేశాడు. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో ఉల్లిగడ్డ కిలో రూ. 200 పలికింది. దీంతో మల్లిఖార్జున్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు రూ. 15 నుంచి రూ. 20 లక్షల పెట్టుబడి పెడితే..కోటి వరకు లాభం వచ్చిందంటున్నాడు మల్లిఖార్జున్. కానీ ధరలు మాత్రం కుప్పకూలి ఉంటే మాత్రం..తాను తీవ్రంగా నష్టాల్లో కూరుకపోయి ఉండేవాడినని తెలిపారు. 

అక్టోబర్ మాసం వరకు ధరలు తక్కువగానే ఉన్నాయని, క్వింటాల్‌కు సుమారు రూ. 7 వేలు మాత్రమే వచ్చాయన్నారు. కొద్ది రోజుల్లో ఈ ధర రూ. 12 వేలను తాకిందన్నారు. ఈ క్రమంలో ఉల్లిగడ్డల దొంగతనం జరుగుతుందని తెలుసుకున్న తాము..పలు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. భూగర్భ జలాలు ఉండడంతో పంటను పండించామన్నారు. 
Read More : వీడియో చిక్కులు : నటి పాయల్ రోహత్గి అరెస్టు