విద్యార్థులతో Anti CAA నాటకం : స్కూల్ పై దేశద్రోహం కేసు
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఓ స్కూల్ పై అధికారులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనికి కారణం విద్యార్థులతో యాంటీ సీఏఏ నాటకం ప్రదర్శించడమే. స్కూల్

ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఓ స్కూల్ పై అధికారులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనికి కారణం విద్యార్థులతో యాంటీ సీఏఏ నాటకం ప్రదర్శించడమే. స్కూల్
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఓ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనికి కారణం విద్యార్థులతో యాంటీ సీఏఏ నాటకం ప్రదర్శించడమే. స్కూల్ వార్షిక వేడుకల్లో భాగంగా పిల్లలతో పలు ప్రదర్శనలు ఇప్పించారు. అందులో పౌరసత్వ సవరణ చట్టం(CAA), NRCలకు వ్యతిరేకంగా నాటకం ఉంది. జనవరి 21న వార్షిక వేడుకలు జరిగాయి.
యాంటీ సీఏఏ ప్రదర్శన వివాదాస్పదమైంది. స్కూల్ యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు జనవరి 26న స్కూల్ యాజమాన్యంపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. 124ఏ(sedition), 504(provoking breach of peace), 505(2), (statements promoting enmity), 34 (act done by several persons in furtherance of common intention) and 153A (promoting communal hatred) సెక్షన్ల కింద కేసు పెట్టారు.
మహ్మద్ యూసఫ్ రహీమ్ అనే జర్నలిస్ట్ విద్యార్థుల ప్రదర్శనకి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్కూల్ యాజమాన్యంపై FIR నమోదు చేశామని, కేసు విచారణ జరుగుతోందని బీదర్ ఎస్పీ తెలిపారు. షాహీన్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్ సీఈవో మాట్లాడుతూ.. పోలీసులు తరుచుగా తమ స్కూల్ కి వస్తున్నారని, పిల్లలను మెంటల్ గా వేధిస్తున్నారని వాపోయారు.
“నిన్న కంట్రోల్ రూమ్ ని పోలీసులు సీజ్ చేశారు. 4, 5వ తరగతి విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. ఐదారుగురు విద్యార్థులు మాత్రమే ప్రదర్శనలో పాల్గొన్నారు. కొంతమంది దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు” అని సీఈవో ఆవేదన వ్యక్తం చేశారు.
బీదర్ లోని సోషల్ వర్కర్ నీలేష్ అనే వ్యక్తి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాగా, వీడియో వివాదాస్పదం కావడంతో.. పోలీసులు దాన్ని తొలగించారు. ఆ వీడియోలో ఏముందంటే.. ముస్లింలు ఈ దేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముస్లింలు తమ తల్లిదండ్రులు, వారి తాతల నాటి వివరాలు, ఫొటోలు ఇవ్వాలని ప్రభుత్వం అడుగుతోంది. ఆ డాకుమెంట్స్ ఇవ్వలేకపోతే.. భారత దేశం విడిచి వెళ్లిపోవాలని చెబుతున్నారు” అనే డైలాగులు ఆ వీడియోలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సీఏఏ, ఎన్పీఆర్ ల గురించి స్కూల్ యాజమాన్యం తప్పుడు వార్తలు ప్రచారం చేసిందని.. పిల్లలను, సమాజాన్ని తప్పుదోవ పట్టించిందని.. అందుకే కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. ప్రధానిని కించపరిచేలా పిల్లలతో డైలాగులు చెప్పించారని తెలిపారు.