Sri Siddeshwara Swamiji Passes away : జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి సిద్ధేశ్వర స్వామీజీ కన్నుమూత.. ప్రధాని మోడీ సంతాపం..
కర్ణాటకలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి ప్రముఖ సన్యాసి సిద్ధేశ్వర స్వామిజీ కన్నుమూశారు. 81 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. సిద్ధేశ్వర స్వామీజికి ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఆయన మరణంతో మంగళవారం (జనవరి 3) ఆయన గౌరవార్థం పాఠశాలలు-కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. సిద్ధేశ్వర స్వామిజీ మరణం వార్త తెలుసుకున్న ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Sri Siddeshwara Swamiji Passes away
Sri Siddeshwara Swamiji Passes away : కర్ణాటకలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి ప్రముఖ సన్యాసి సిద్ధేశ్వర స్వామిజీ కన్నుమూశారు. 81 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో సోమవారం (జనవరి 3,2023) సాయంత్ర కన్నుమూశారు. కొంతకాలంగా వీల్ చైర్ కే పరిమితమైన స్వామీజీ ఆశ్రమంలో తుదిశ్వాస విడిచారు. సిద్ధేశ్వర స్వామీజికి ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఆయన మరణంతో మంగళవారం (జనవరి 3) ఆయన గౌరవార్థం పాఠశాలలు-కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. సిద్ధేశ్వర స్వామిజీ మరణం వార్త తెలుసుకున్న ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఆయన మృతి చెందినట్లు సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు జ్ఞానయోగాశ్రమానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. సిద్ధేశ్వర స్వామీజీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. విజయపూర్ జిల్లా యంత్రాంగం మంగళవారం (జనవరి 3) ఆయన గౌరవార్థం పాఠశాలలు-కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు సిద్ధేశ్వర స్వామీజీ పార్థివదేహాన్ని ఆశ్రమంలో సాధారణ ప్రజల చివరి దర్శనం కోసం ఉంచుతారని, ఆ తర్వాత సైనిక్ స్కూల్ ప్రాంగణంలో భౌతికకాయాన్ని ఉంచుతారని అధికారిక ప్రకటించారు.
స్వామీజీ భౌతికకాయాన్ని మరోసారి ఆశ్రమానికి తీసుకొచ్చి, సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆశ్రమం నిబంధనల ప్రకారం..స్వామీజి చివరి కర్మలు వారి కోరిక మేరకు నిర్వహించనున్నారు నిర్వాహకులు. స్వామీజి నడిచే దేవుడిగా పేరొందిన ఆయన వృద్ధాప్య సమస్యలతో పోరాడే స్వామీజీని ఆస్పత్రికి తీసుకువెళ్లినా చికిత్స్ తీసుకోవటానికి నిరాకరించారు. ఆహారం తీసుకోవడానికి కూడా నిరాకరించారు. అలా సోమవారం ఉదయం నుండి సాధువు ఆరోగ్యం క్షీణించడంతో ఆశ్రమం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ప్రజలు ఆయనను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
సిద్ధేశ్వర స్వామి మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించారు. పరమ పూజ్య సిద్ధేశ్వర స్వామి ఈ సమాజానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని తెలిపారు. ఇతరుల అభ్యున్నతి కోసం అవిశ్రాంత పోరాటం చేశారని సిద్ధేశ్వర స్వామి సేవలను కొనియాడారు. ఈ దుఃఖ ఘడియలో నా ఆలోచనలు ఆయన అనేక మంది భక్తులతో ఉన్నాయి. ఓం శాంతి! అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Paramapujya Sri Siddheshwara Swami Ji will be remembered for his outstanding service to society. He worked tirelessly for the betterment of others and was also respected for his scholarly zeal. In this hour of grief, my thoughts are with his countless devotees. Om Shanti. pic.twitter.com/DbWtdvROl1
— Narendra Modi (@narendramodi) January 2, 2023
కర్ణాటక మాజీ సీఎం, జెడి(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామి కూడా ఆధ్యాత్మిక నాయకుడికి నివాళులర్పిస్తూ, “మనకు నడిచే వెలుగు, నడిచే అవగాహన, నడిచే దేవుడు, జ్ఞాన యోగాశ్రమంలోని జ్ఞానయోగి పరమపూజ్య శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వర స్వామిజీ శివైక్య” అని ట్వీట్ చేశారు. కర్ణాటకలోని విజయపురలోని బిజ్జరగిలో పుట్టి పెరిగారు సిద్ధేశ్వరస్వామి. అతన్ని బుద్దిజీ అని కూడా ముద్దుగా పిలిచేవారు. ఆయన గురువైన వేదాంత కేసరి శ్రీ మల్లికార్జున మహాశివయోగిచే గణిత శాస్త్రోక్తంగా నియమితులయ్యారు.