Women Prisoners..Karwa Chauth : భర్తలను హత్య చేసినవారితో సహా.. కర్వాచౌత్ పండుగ జరుపుకుని జైలులో ఉపవాసం చేసిన మహిళా ఖైదీలు..
భర్తలు ఆరోగ్యంగా..దీర్ఘావువుతో ఉండాలని కోరుకుంటూ చేసుకునే కార్వాచౌత్ పండుగను ఉత్తర ప్రదేశ్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు కూడా జరుపుకున్నారు. భర్తలను హత్య చేసిన మహిళా ఖైదీలు కూడా ఈ పండుగను జరుపుకోవటం విశేషం.

2 Women Prisoners Implicated in Murders of Their Husbands Observe Fast in Lucknow Jail..
Women Prisoners..Karwa Chauth in Lucknow Jail : కర్వాచౌత్. ఉత్తరాదిలో ఎక్కువమంది మహిళలు జరుపుకునే సంప్రదాయం ఇది.కర్వా చౌత్ రోజున మహిళలు సూర్యోదయం నుంచి చంద్రోదయం పచ్చి వరకు మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. భర్తలు తమ భర్తలు దీర్ఘయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.2022 అక్టోబర్13న కార్వా చౌత్ పండుగ వచ్చింది. ఈ వేడుకలో మహిళలు చంద్రోదయం అయ్యాక జల్లెడలోంచి చంద్రుడిని చూసి ఆ తరువాతే ఆహారం తీసుకుంటారు.
భర్తలు ఆరోగ్యంగా దీర్ఘావుతో ఉండాలని ఉండాలని కోరుకుంటూ చేసుకునే ఈ కార్వాచౌత్ పండుగను ఈ సంవత్సరం ఉత్తర ప్రదేశ్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు కూడా జరుపుకోవటం విశేషం. ఈ కార్వాచౌత్ ను జరుపుకోవటానికి జైళ్లశాఖ మహిళా ఖైదీలకు అనుమతి ఇచ్చింది. దీంతో గురువారం (అక్టోబర్ 13,2022)న వచ్చిన ఈ కార్వాచౌత్ పండుగను జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు ఉపవాసం ఉండి జరుపుకున్నారు. అంతకంటే మరో విశేషం మరొకటి ఏమిటంటే భర్తలను హత్య చేసిన జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు కూడా ఈ కార్వాచౌత్ పండుగను జైలులో ఉపవాసం ఉండి జరుపుకోవటం..!!
కర్వా చౌత్ నేపథ్యంలో జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలు ఉపవాసం ఉండి ఈ పూజలు నిర్వహించేందుకు యూపీ జైళ్ల శాఖ మంత్రి అనుమంచింది. పూజా సామగ్రితోపాటు తినుబండారాలను కూడా వారి కుటుంబం నుంచి అనుమతించారు జైలు అధికారులు. అలాగే కర్వా చౌత్ కోసం జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొందరు మహిళా ఖైదీల భర్తలను కూడా ఈ పూజలకు అనుమతించటం విశేషమని చెప్పుకోవాలి. ఎందుకంటే భర్తలు దీర్ఘావుతో ఆరోగ్యంగా ఉండాలని జరుపుకునే ఈ పండుగను భర్తలను హత్య చేసిన మహిళా ఖైదీలు కూడా జరుపుకోవటం విశేషం కాకమరేమిటి?.!!
కర్వా చౌత్ సందర్భంగా లక్నో జైలులోని సుమారు 50 మంది మహిళా ఖైదీలు గురువారం ఉపవాస దీక్ష ఆచరించారు. వీరిలో పది మంది మహిళలు తొలిసారి ఈ పూజలు చేశారు. అలాగే గోరఖ్‌పూర్ జిల్లా జైలులో కూడా 12 మంది మహిళా ఖైదీలు కర్వా చౌత్ ఉపవాసం పాటించారు. అయితే భర్తలను హత్య చేసిన ఇద్దరు మహిళలు కూడా ఉపవాసం ఉండటం చూసి జైలు అధికారులు ఆశ్చర్యపోయారు. అలాగే ప్రియుడి సహకారంతో సోదరుడ్ని హత్య చేసిన ఒక ముస్లిం మహిళ కూడా కర్వా చౌత్ ఉపవాసాన్ని పాటించినట్లు జైలు అధికారులు తెలిపారు.