Seema and Sachin: ఈ హోటల్లో రూమ్ నం.204లో గడిపిన సీమ, సచిన్.. అక్కడిదే ఈ వీడియో.. ఆ తర్వాత భారత్‌లోకి ఇలా..
అక్కడ హోటల్ రూమ్ ను బుక్ చేసుకునేందుకు కూడా సచిన్, సీమా గులాం హైదర్ నకిలీ పేర్లను ఉపయోగించారు. ఆ హోటల్లోనే..

Seema and Sachin
Seema and Sachin – Kathmandu: ఆన్‌లైన్‌లో పబ్జీ (PUBG) ఆటతో పరిచయం పెంచుకుని, కమ్మని మాటలతో భారతీయ యువకుడికి దగ్గరై పాకిస్థాన్ (Pakistan) నుంచి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశ పెట్టిన యువతి సీమా గులాం హైదర్ గురించి మరిన్ని వివరాలు తెలిశాయి. సచిన్ మీనా అనే భారతీయ యువకుడితో ప్రేమలో పడి ఇక్కడకు వచ్చానని సీమా గులాం చెబుతున్న విషయం తెలిసిందే.
భారత్ లోకి ప్రవేశించే ముందు సచిన్‌తో నేపాల్ (Nepal) రాజధాని కాఠ్మాండులో ఓ హోటల్ గదిలో ఆమె గడిపింది. దాదాపు వారం రోజుల పాటు వారిద్దరు కాఠ్మాండులోని న్యూ వినాయక్ హోటల్లో రూమ్ నంబరు 204లో వారు ఉన్నారు.
అక్కడ హోటల్ రూమ్ ను బుక్ చేసుకునేందుకు కూడా సచిన్, సీమా గులాం హైదర్ నకిలీ పేర్లను ఉపయోగించారు. ఆ హోటల్లోనే వారిద్దరు హోటల్ సిబ్బంది పిల్లలతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీసుకున్నారు. మొదట సచిన్ హోటల్ కు వెళ్లి రూమ్ బుక్ చేశాడు. తన భార్య తర్వాత వస్తుందని హోటల్ సిబ్బందితో చెప్పాడు.
అనంతరం సీమా వచ్చింది. వారిద్దరు తమ వద్ద గుర్తింపు కార్డులు లేవని చెప్పారు. వారి పేర్లను మాత్రమే రిజిస్టర్ లో రాశారు. అందులో రాసింది కూడా మారుపేర్లే. హోటల్ సిబ్బందితో వారు నవ్వుతూ గడిపేవారు. తాను పాకిస్థాన్ అమ్మాయినని సీమ హోటల్ సిబ్బందికి ఎన్నడూ చెప్పలేదు.
వారున్న రూమ్ నంబర్ 204 చిన్న గదే. అందులో ఓ అద్దం, డబుల్ బెడ్ ఉన్నాయి. వారం రోజులు హోటల్లో గడిపిన తర్వాత సీమ, సచిన్ ఒక్కసారిగా ట్యాక్సీని బుక్ చేసుకుని పోఖరా ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత భారత్ వచ్చారు. సీమా వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.
View this post on Instagram
#WATCH | Kathmandu | Ganesh – a hotel owner in Nepal claims that UP resident Sachin and Pakistani national Seema Haider stayed at his hotel.
He says, “They came here in March and left after staying here for 7-8 days. Most of the time, they used to be inside their room, go out in… pic.twitter.com/3AshzqNxCL
— ANI (@ANI) July 19, 2023