కోళ్ల నుంచి గబ్బిలాలకు సోకిన కొత్త వైరస్

కోళ్ల నుంచి గబ్బిలాలకు సోకిన కొత్త వైరస్

Updated On : March 10, 2020 / 7:58 PM IST

నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన వైరస్ కారణంగా వందల సంఖ్యలో కోళ్లు చచ్చిపోయాయి. అలాంటిదే కేరళలో సంభవించడంతో కోళ్లు మాత్రమే కాదు.. ఆ వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే డజన్ల కొద్దీ గబ్బిలాలు మృతి చెందాయి. కొజిక్కొడె జిల్లాలో జరిగిన ఈ ఘటనను స్థానికులు జంతు సంబంధిత అధికారులకు తెలియజేయడంతో వాటి శాంపుల్స్ తీసుకుని వైద్య పరీక్షలకు పంపారు. 

చనిపోయిన గబ్బిలాల శరీరాల నుంచి శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపాం. ఆ వైరస్ వేరే వాటికి సోకకుండా కాల్చి బూడిద చేశాం.  మెడికల్ టెస్టు రిపోర్టులు రావడానికి కొద్ది రోజుల సమయం పడుతుందని డాక్టర్ కేవీ ఉమా తెలిపారు. కొజిక్కెడ్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ కోళ్ల ఫారం చుట్టూ తిరిగిన గబ్బిలాలకు వైరస్ సోకడంతో చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. (చలికాలంలో కరోనా ఉగ్రరూపం చూడాల్సిందేనా.. సైంటిస్టుల మాట)

Type-A Influenzaకు సంబంధించిన H5, H7 వైరస్‌ల కారణంగా వందల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఈ కోళ్ల ఫారంకు కిలోమీటర్ దూరం వరకూ 12వేల పక్షులు ఉంటున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి కావడం ఆపకపోతే మరిన్నింటి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ముందస్తు జాగ్రత్తగా 10కిలోమీటర్ల దూరం వరకూ షాపులకు కోళ్లను, గుడ్లను అమ్మవద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు మాట ఇచ్చారు. ఇదే జిల్లాలో 2018లో నిఫా వైరస్ కారణంగా భారీ నష్టం సంభవించింది. గబ్బిలాల నుంచి పుట్టిన వైరస్.. ఆ జిల్లాల్లో 18మంది ప్రాణాలను బలిగొంది. అనుమానించినట్లే కోళ్ల ఫారంలో వైరస్ సోకే గబ్బిలాలు మరణించాయా.. మరేదైనా వైరస్ కారణమా అనేది తెలియాలంటే టెస్టు రిపోర్టులు రావాలసిందే. 

See Also | ఉస్సేన్ బోల్ట్ కూడా తప్పించుకోలేడు.. ఇది వేట కాదు