Kerala Couple: భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైన సీసీ కెమెరా..! జైలుకెళ్లిన భర్త

కేరళ రాష్ట్రంలో దంపతుల మధ్య సీసీ కెమెరా పెద్ద వివాదాన్ని సృష్టించింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వస్త్ర దుకాణంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. గత నెల 25న బైక్ పై వెళ్తుండగా మార్గం మధ్యలో ఓ యువతి లిఫ్ట్ అడిగింది.

Kerala Couple: భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైన సీసీ కెమెరా..! జైలుకెళ్లిన భర్త

traffic cctv camera

Updated On : May 11, 2023 / 10:05 AM IST

Kerala Couple: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని చెబుతుంటారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వీధివీధిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తుంటారు. అంతేకాక, నగరంలోని ప్రధాన కూడళ్లు, గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ, ఇదే సీసీ కెమెరా కారణంగా భార్యాభర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో తనను కొట్టాడంటూ భర్తపై భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేరళ రాష్ట్రంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

MS Dhoni: ధోని గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే.. ఢిల్లీ ఆట‌గాళ్లు ఇలా అన్నారేంటి..?

కేరళ రాష్ట్రంలో దంపతుల మధ్య సీసీ కెమెరా పెద్ద వివాదాన్ని సృష్టించింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వస్త్ర దుకాణంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. గత నెల 25న బైక్ పై వెళ్తుండగా మార్గం మధ్యలో ఓ యువతి లిఫ్ట్ అడిగింది. దీంతో ఆమెను బైక్ పై ఎక్కించుకొని వెళ్తున్నాడు. తలకు హెల్మెంట్ ధరించక పోవటంతో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఆ చలాన్‌ను బండి యాజమాని ఫోన్ కు పంపించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

Traffic Restrictions: ట్రాఫిక్ ఆంక్షలు.. మూడు నెలలు కొండాపూర్ రోడ్డు మూసివేత.. వాహనదారులు ఏ మార్గాల్లో వెళ్లాలంటే..?

సదరు వ్యక్తి నడిపిన బండి తన భార్య పేరుపై ఉంది. దీంతో పోలీసులు పంపించిన చలాన్, సంబంధించిన ఫొటో ఫోన్‌కు రావడంతో భర్తను భార్య నిలదీసింది. ఆమె ఎవరో నాకు తెలియదు, లిఫ్ట్ అడిగితే బైక్ ఎక్కించుకున్నానని భర్త సమాధానం ఇచ్చాడు. అయినా భార్య వినిపించుకోకపోవటంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను, తన మూడేళ్ల కుమార్తెను భర్త కొట్టాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.