MS Dhoni: ధోని గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే.. ఢిల్లీ ఆట‌గాళ్లు ఇలా అన్నారేంటి..?

ధోని గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే ఏం చెబుతారు.?. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై ఆటకు ముందు కొంత మంది ప్రత్యర్థి ఆటగాళ్లకు ఇదే ప్ర‌శ్నఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది.

MS Dhoni: ధోని గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే.. ఢిల్లీ ఆట‌గాళ్లు ఇలా అన్నారేంటి..?

MS Dhoni

MS Dhoni: మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. టీమ్ఇండియా(Team India)కు రెండు ప్ర‌పంచ క‌ప్‌లు(2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌) అందించిన కెప్టెన్‌. అత‌డి సార‌ధ్యంలో 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీని సైతం టీమ్ఇండియా గెలుచుకుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్ల‌లో ఒక‌రు. చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు నాలుగు సార్లు టైటిల్ అందించిన నాయ‌కుడు. ఎంద‌రికో ధోని ఆద‌ర్శం.

ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌డికి అభిమానులు ఉన్నారు. అత‌డి ఆట‌ను చూసేందుకు దూరాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా స్టేడియానికి వ‌స్తున్న‌వారు ఎంద‌రో. అభిమానులు అత‌డిని ముద్దుగా ‘మిస్ట‌ర్ కూల్‌’, ‘త‌లైవా’, ‘కెప్టెన్ కూల్’ అని పిలుచుకుంటుంటారు. ఆగష్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 41 ఏళ్ల ధోని ఐపీఎల్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు. ఇవ‌న్నికాసేపు ప‌క్క‌న పెడితే.. ధోని గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే ఏం చెబుతారు.?

MS Dhoni: నాకిది చివ‌రి ఐపీఎల్ అని మీరు ఫిక్స్ అయ్యారు.. నేను కాదు : ఎంఎస్ ధోని

బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై ఆటకు ముందు కొంత మంది ప్రత్యర్థి ఆటగాళ్లకు ఇదే ప్ర‌శ్నఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, ప్రియమ్ గార్గ్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్ ఇంకా చాలా మంది ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది చెప్పిన స‌మాధానం ‘లెజెండ్’.

ఎవ‌రు ఎమ‌న్నారంటే..?

ఇషాంత్ శర్మ – బిగ్ బ్రదర్, మిచెల్ మార్ష్ – లెజెండ్, అక్షర్ పటేల్ – కెప్టెన్ కూల్, ప్రియమ్ గార్గ్ – మాటలు లేవు, చేతన్ సకారియా – తలైవా, ఖలీల్ అహ్మద్ – లెజెండ్, సర్ఫరాజ్ ఖాన్ -పెద్ద అభిమాని, విక్కీ ఓస్త్వాల్ – కెప్టెన్, అమన్ ఖాన్ – దేవుడు, రిపాల్ పటేల్ – ఫినిషర్, ముఖేష్ కుమార్ – మాటలు లేవు, యష్ ధుల్ – లెజెండ్, ప్రవీణ్ దూబే – లెజెండ్ అని అన్నారు.

MS Dhoni: ధోని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు రాక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌దేనా..?

ధోని రిటైర్‌మెంట్‌పై రైనా వ్యాఖ్య‌లు..

ఐపీఎల్ నుంచి ధోని రిటైర్‌మెంట్ పై సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇటీవ‌ల ధోనిని క‌లిసిన‌ప్పుడు రిటైర్‌మెంట్ గురించి ప్ర‌స్తుతానికి ఎలాంటి ఆలోచ‌న చేయ‌డం లేద‌ని త‌లైవా చెప్పిన‌ట్లు రైనా తెలిపాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన త‌రువాత మ‌రో సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆడ‌తాన‌ని మ‌హేంద్రుడు అన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం వైర‌ల్‌గా మారింది.