Crime in Kerala: దొంగ అనుకుని కూతురు స్నేహితుడిని హతమార్చిన తండ్రి

కేరళలోని తిరువనంతపురంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. దొంగగా భావించి కూతురు స్నేహితుడిని కొట్టి చంపాడు ఓ వ్యక్తి.

Crime in Kerala: దొంగ అనుకుని కూతురు స్నేహితుడిని హతమార్చిన తండ్రి

Crime

Updated On : December 29, 2021 / 9:46 PM IST

Crime in Kerala: కేరళలోని తిరువనంతపురంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. దొంగగా భావించి కూతురు స్నేహితుడిని కొట్టి చంపాడు ఓ వ్యక్తి. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరువనంతపురంలోని పెట్టహ్ లో నివాసముంటున్న లలన్ అనే వ్యక్తి.. బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో తన ఇంటిలోకి దొంగలు(భావించాడు) ప్రవేశించినట్టు గుర్తించాడు. దొంగను పట్టుకుని అతన్ని బందించాలని చూసిన.. లలన్..నక్కి నక్కి వస్తున్న యువకుడి తలపై కర్రతో బలంగా కొట్టాడు. అనంతరం లైట్లు వేసి చూడగా..రక్తపు మడుగులో పడిఉన్న యువకుడు కనిపించాడు. ఆ యువకుడు తన కూతురు స్నేహితుడు అనీష్ జార్జ్ గా గుర్తించిన లలన్.. వెంటనే తన తప్పును గ్రహించి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

Also read: National News: లూథియానా జిల్లా కోర్ట్ లో బాంబు బ్లాస్ట్ వెనుక మాస్టర్ మైండ్ జర్మనీలో అరెస్ట్

ఘటనపై కేసు నమోదు చేసిన తిరువనంతపురం నగర పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని.. అనీష్ ను ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే అనీష్ జార్జ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 19 ఏళ్ల అనీష్ జార్జ్ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు, లలన్ కూతురిని కలిసేందుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని మాత్రమే తాను భావించానని.. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ లలన్ పోలీసులకు వివరించాడు.

Also Read: Wonder Place: సముద్రం మధ్యలో వేలిముద్రలాంటి “ద్వీపం”