Kerala Sculptor : మట్టి, 65 హెర్బల్ మొక్కలతో ఇంటిని నిర్మించిన శిల్పి

ఆరు సంవత్సరాలుగా ఔషధ మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. ఔషధ మొక్కలతో ఇంటి నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది అతనికి.

Kerala Sculptor : మట్టి, 65 హెర్బల్ మొక్కలతో ఇంటిని నిర్మించిన శిల్పి

Kerala

Updated On : December 3, 2021 / 9:30 AM IST

House Made Out Of 65 Herbal Plants : మాములు ఇల్లు నిర్మించాలంటే..సిమెంట్, ఇసుక, కంకర ఇతరత్రా సామాగ్రీ కావాలి. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే..భారీగానే ఖర్చు అవుతుంది. అదే రూఫ్ అయితే..భారీగానే డబ్బులు అవసరం పడుతాయి. కానీ..కొంతమంది తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మింప చేస్తుంటారు. తక్కువ వ్యవధిలోనే ఇళ్లు నిర్మాణం చేస్తూ..వార్తల్లో నిలుస్తుంటారు. ఓ శిల్పి కేవలం మట్టి, ఆయుర్వేద మొక్కలను ఉపయోగించి ఇంటిని కట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Omicron : అమెరికాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..న్యూయార్క్ లో కొత్తగా ఐదు

తిరువనంతపురంలో Sila Santhosh అనే శిల్పి నివాసం ఉంటున్నాడు. దేవాలయాలయాల నిర్మాణ చేపట్టే కుటుంబం నుంచి వచ్చారు. ఇతనికి ఔషధ మొక్కలు అంటే చాలా ఇష్టం. గత ఆరు సంవత్సరాలుగా ఔషధ మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. వివిధ రకాల మూలికలను మట్టిలో కలపడం, ఇతరత్రా చేయడం వంటివి చేయడం జరిగిందన్నారు. మట్టి..ఔషధ మొక్కలతో ఇంటి నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది అతనికి. ఇదే విషయాన్ని ఆయుర్వేదం, మూలికా మొక్కలలో నిపుణులైన దాదాపు 40 మందితో తాను మాట్లాడడం జరిగిందన్నారు. అనంతరం తన పరిశోధనకు సంబంధించి ఓ నివేదికను తయారు చేసినట్లు చెప్పారు.

Read More : Cyclone Jawad : బలపడిన వాయుగుండం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

రాష్ట్ర రాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో ఇతని సన్నిహిత మిత్రుడు Jacob Thankachanకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో తాను ఇంటిని నిర్మిస్తానని చెప్పడంతో ఆయన అంగీకరించారన్నారు. ఇంటికి పూర్తి చేయడానికి సంవత్సరం పట్టిందన్నారు. ఇప్పుడు కేవలం గృహప్రవేశం మాత్రమే మిగిలి ఉందని, ఇప్పుడు ఇంట్లో మూలికల వాసన వస్తోందన్నారు. ఎంతో చల్లగా ఉండడం వల్ల..ఫ్యాన్ అవసరం కూడా లేదన్నారు Sila Santhosh. ఇప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉందని, మరిన్ని పరిశోధనలు చేయడానికి ప్రేరణగా ఉందన్నారు.