Nipah : కేరళలో నిపా వైరస్ కలకలం..హైరిస్క్ వ్యక్తులకు పరీక్షలు
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో హైరిస్క్ వ్యక్తుల నమూనాలను సేకరించి నిపా వైరస్ పరీక్షలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మరో కేసు నిపా వైరస్ పాజిటివ్ గా తేలింది....

Nipah virus
Nipah : కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో హైరిస్క్ వ్యక్తుల నమూనాలను సేకరించి నిపా వైరస్ పరీక్షలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మరో కేసు నిపా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఆరుగురు రోగులకు నిపా పాజిటివ్ అని వెల్లడైంది. ఈ వైరస్ కారణంగా ఇద్దరు రోగులు మరణించారు. ఈ వైరస్ కారణంగా ఆగస్టు 30వతేదీన కోజికోడ్ జిల్లాలో 47 ఏళ్ల వ్యక్తి మరణించారు. దీంతో ఆ రోగిని కలిసిన వారిలో హైరిస్క్ వ్యక్తులకు పరీక్షలు చేస్తున్నామని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పారు. (High Risk Nipah Contact List) కేంద్ర వైద్య నిపుణుల బృందం, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి వైరస్ వ్యాప్తిపై సమీక్షించారు.
Domestic LPG Cylinder : ఎన్నికల వేళ మహిళలకు తాయిలాలు…రూ.450లకే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్
నిపా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు మంత్రి మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు. కేరళ రాష్ట్రంలో 14 మంది రోగులను ఐసోలేషన్ లో ఉంచారు. మరికొంతమంది నిపా రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు. (Kerala To Test Samples) నిపా వైరస్ సోకిందనే అనుమానం ఉన్న రోగుల శాంపిళ్లను ల్యాబరేటరీకి పంపించారు. కోజికోడ్ లోని నిపా కంటైన్ మెంట్ జోన్లలో పరీక్షలు జరిపేందుకు వీలుగా మంత్రి వీణా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ప్రారంభించారు.
Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తుఫాన్ వాహనం-లారీ ఢీ
ఈ మొబైల్ ల్యాబ్ లో పరీక్షలు చేసేందుకు రెండు మిషన్లను ఉంచారు. ఏకకాలంలో 96 శాంపిళ్లను పరీక్షిస్తారు. ఈ వైరాలజీ ల్యాబ్ 24 గంటలపాటు పని చేస్తుందని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ డైరెక్టర్ చంద్రభాస్ నారాయణ చెప్పారు. ఓ ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకడంతో ఆమెను కూడా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సెప్టెంబరు 16వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పలు గ్రామాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది.