కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో… ముగ్గురికి కరోనా వైరస్ పై క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 13, 2020 / 12:59 PM IST
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో… ముగ్గురికి కరోనా వైరస్ పై క్లారిటీ

Updated On : February 13, 2020 / 12:59 PM IST

కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ప్యాసింజర్లకు కరోనా వైరస్ ఉందని తేలినట్లు వస్తున్న వార్తలను కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఖండించింది. నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(NSCBI)లో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు కొన్ని మీడియా ఛానల్స్ లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని,అర్థరహితమని ఎయిర్ పోర్ట్ అధికారిక ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.

అనుమానాస్పద కేసుల కింద కోల్ కతా ఎయిర్ పోర్ట్ గుండా ట్రావెల్ చేస్తున్న ముగ్గురు ప్యాసింజర్లను బెలియాగట్టాలోని ఐడీ హాస్పిటల్ కు ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీస్ రిఫర్ చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు 21వేల 792మంది ప్యాసింజర్లు ఎయిర్ పోర్ట్ వద్ద స్క్రీనింగ్ చేయబడ్డారని ఆ ప్రకటనలో తెలిపారు.

కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో చైనా,హాంకాంగ్,సింగపూర్,థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్యాసింజర్లను ఎయిర్ పోర్ట్ లో రెగ్యులర్ గా చెకప్ చేస్తున్నారు. వారిని పూర్తిగా స్క్రీనింగ్ చేసి కరోనా వైరస్ లేదని నిర్థారించిన తర్వాతనే బయటకి వదులుతున్నారు. చైనాలోని గువాంగ్జు,కున్మింగ్,హాంకాంగ్,సింగపూర్,బ్యాంకాక్ నుంచి వచ్చే ప్యాసింజర్లను జనవరి-17,2020నుంచి స్క్రీనింగ్ చేసిన వైరస్ లేదని నిర్థారించిన తర్వాత బయటకు వదులుతున్నారు. అయితే ప్రస్తుతం చైనా నుంచి భారత్ కు,భారత్ నుంచి చైనాకు విమాన రాకపోకలు నిలిపివేయబడ్డాయి.