Kolkata Influencer: ఫ్లై ఓవర్ మీద నైటీతో డ్యాన్స్.. కట్ చేస్తే సీన్ రివర్స్

వర్షంలో తడవాలని, ఆడుకోవాలని ఉంటుంది కానీ, సరదాకైనా హద్దు ఉండాలిగా.. డ్యాన్స్ వేయడానికి ప్లేస్ ఏదైతే ఏమైందని.. క్రేజ్ కొట్టేయాలని చేసిన పనికి భారీ మూల్యం చెల్లించకతప్పట్లేదు.

Kolkata Influencer: ఫ్లై ఓవర్ మీద నైటీతో డ్యాన్స్.. కట్ చేస్తే సీన్ రివర్స్

Kolkata Influncer

Updated On : September 23, 2021 / 3:24 PM IST

Kolkata Influencer: వర్షంలో తడవాలని, ఆడుకోవాలని ఉంటుంది కానీ, సరదాకైనా హద్దు ఉండాలిగా.. డ్యాన్స్ వేయడానికి ప్లేస్ ఏదైతే ఏమైందని.. క్రేజ్ కొట్టేయాలని చేసిన పనికి భారీ మూల్యం చెల్లించకతప్పట్లేదు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉన్న రోడ్డుపై చిందులేసింది. అక్కడితో సరదా తీరిపోయిందనుకుంది. కానీ, ఆ తర్వాతే చిక్కులు మొదలయ్యాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో 2లక్షల60వేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న కోల్‌కతాలోని సాండీ సాహా అనే ట్రాన్స్‌జెండర్‌.. కొండ ప్రాంతాలు, నదీతీరాల్లో రీల్స్‌ చేసి పోస్టు చేసే ఈమె కొత్త ఫీట్ చేసింది. ఈసారి మాత్రం రద్దీగా ఉన్న ఫ్లై ఓవర్‌పై కారు నుంచి దిగి విచిత్రమైన హావభావాలు పలికిస్తూ… డివైడర్‌ మీదకు వెళ్లి డ్యాన్స్‌ చేయడం మొదలెట్టింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్‌ చేసింది.

ఫేస్‌బుక్‌లో వైరల్ అయిన సాహా వీడియో చూసిన ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీ ద్వారా కారు ఓనర్‌ని గుర్తించారు. సాహానే దాని యజమాని అని గుర్తించారు. కేసు ఫైల్‌ చేసి శ్రేయా కల్రా రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు రోడు మీదకొచ్చి డ్యాన్స్‌ చేసిందని అందులో పేర్కొన్నారు.
…………………………………………………………TSRTC: నాలుగు నెలలే టార్గెట్.. గాడిన పడకపోతే ప్రైవేట్ పరమే!
ట్రాఫిక్ రూల్స్‌ అతిక్రమించిందని కేసు నమోదు చేశారు. ఫ్యామస్ కావడం కోసం, వ్యూస్‌, లైకుల కోసం ఇలాంటి వీడియోలు చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు వారిస్తున్నారు.