లక్ లక్కలా అతుక్కుంది : చెత్తలో పడేసిన లాటరీ టిక్కెట్టుకు రూ.కోటి ప్రైజ్  

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 05:39 AM IST
లక్ లక్కలా అతుక్కుంది : చెత్తలో పడేసిన లాటరీ టిక్కెట్టుకు రూ.కోటి ప్రైజ్  

Updated On : January 6, 2020 / 5:39 AM IST

అదృష్టవంతుడిని ఎవ్వరూ చెడగొట్టలేరు అనే మాట మరోసారి నిజమైంది. లాటరీ టిక్కెట్ కొని ఎవరో ఏదో అన్నారని దాన్ని చెత్తబుట్టలో పడేసిన లాటరీ టిక్కెట్ కు రూ.కోటి రూపాయలు ప్రైజ్ మనీ వచ్చింది. పశ్చిమబెంగాల్  కోల్‌కతాకు చెందిన వ్యాపారి తలదిక్  దమ్‌దమ్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముతుంటాడు. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. అలా నాగాలాండ్ లాటరీ టిక్కెట్ లాటరీ టిక్కెట్లు కొన్నాడు. కానీ హా..నువ్వు ఎన్నిసార్లు కొన్నా లాటరీ టిక్కెట్లుకు డబ్బులు రానే రావు అంటూ ఎగతాళి చేశారు. దీంతో ఆవేదనతో ఆ టిక్కెట్లను సాదిక్ చెత్తబుట్టలో పడేశాడు. తరువాత ఆ సంగతి మరచిపోయాడు. తను రోజు వారీ వ్యాపారం చేసుకుంటున్నాడు. 

ఈ క్రమంలో సాదిక్ కు లాటరీ టిక్కెట్లు అమ్మిన వ్యక్తం కనిపించాడు. సాదిక్..నీకు రూ.1కోటి లాటరీ తగిలింది అని చెప్పాడు. దీంతో ఒక్కసారి షాక్ అయ్యాడు సాదిక్.నిజమేనా నిజ్జంగా నేను కొన్న టిక్కెట్లకు లాటరీ తగిలిందా? అని అడిగాడు. నిజమేనని చెప్పాడు సదరు వ్యక్తి. దీంతో వెంటనే తాను ఆ టిక్కెట్లను చెత్తబుట్టలో పడేసిన ఘటన గుర్తుకొచ్చింది. ఒక్కసారిగి సాదిక్ గుండె గుబేలుమంది. 

వెంటనే భార్య  అమీనాకు ఫోన్ చేసి చెత్తబుట్టలో పడేసిన లాటరీ టిక్కెట్లు ఉన్నాయేమో వెతకమని చెప్పాడు. దీంతో ఆమె లాటరీ టిక్కెట్ల కోసం చెత్త బుట్టలో వెతికగ్గా అవి దొరికాయి..వెంటనే లాటరీ టిక్కెట్లు దొరికాయని అమీనా భర్త సాదిక్ కు చెప్పింది. ఇంకేముంది సాదిక్..భార్య అమీనా ఆనందానికి హద్దే లేదు. 

వారు కొన్న మొత్తం ఐదు టిక్కెట్లలో ఒక టిక్కెట్‌కు కోటి రూపాయల దక్కగా మిగిలిన నాలుగు టిక్కెట్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా అమీనా మాట్లాడుతూ లాటరీలో వచ్చిన మొత్తంతో తమ జీవితం మారిపోతుందని ఇప్పటి వరకూ ఎన్నో కష్టాలు పడ్డాం ఆ భగవంతుడు మా మొర ఆలకించాడు. లాటరీతో వచ్చిన డబ్బులతో మా జీవితాలు మారిపోతాయి అంటూ ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు సాదిక్..అతని భార్య అమీనా. నా కొడును మంచి స్కూల్లో చదివిస్తాం అంటూ సంతోషపడిపోతోంది.