దేశ రాజకీయాల్లోకి వెళ్తారట కేసీఆర్ సారు! కాబోయే సీఎం..

అవును.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న చర్చ ఫుల్ ట్రెండింగ్‌గా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఇది మరింత జోరందుది. పార్టీ నేతలు ఎవరికి వారే కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తాలు పెట్టేస్తున్నారు. వారి ఊహల్లో అప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చన్నట్టే ఉందని జనాలు అంటున్నారు. కాకపోతే సీఎం కేసీఆర్ కూడా ఎక్కడా ఈ వార్తలను గట్టిగా కొట్టిపారేయక పోవడంతో ఫైనల్‌గా ముహూర్తమే మిగిలిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. చిన్న సారు సీఎం కుర్చీ మీద కూర్చుంటారు సరే.. మరి పెద్ద సారు ఏం చేస్తారన్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా ఈ మధ్య కేటీఆర్ చేసిన ఓ వ్యాఖ్య సమాధానంగా ఉందంటున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లోకి కేసీఆర్ :
బయో ఆసియా సదస్సులో కేటీఆర్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మధ్య జరిగిన మాటా మంతిలో టీఆర్ఎస్ జాతీయ పార్టీ కావాలని కేటీఆర్ అనడం.. కేంద్ర మంత్రి వెల్ కమ్ చెప్పడంతో కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారనే నిర్ణయానికి పార్టీ వర్గాలు వచ్చేశాయట. కేటీఆర్ సీఎం అయితే.. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లాలి. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబులకు మించి చక్రం తిప్పాలని కలలు కంటున్నారట గులాబీ నేతలు. ఇప్పటికే కేసీఆర్ చేతిలో ఫెడరల్ ఫ్రంట్ అనే ప్రతిపాదన ఉండనే ఉంది. ఇక దీన్ని యాక్టివ్ చేయడం.. లేదంటే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఏకంగా ఓ జాతీయ పార్టీనే స్థాపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పగలరని అంచనా వేస్తున్నారు.
1977లో నాటి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు కలిసి జనతాపార్టీగా మారాయి. ఇప్పుడు కూడా అటు మోదీ, ఇటు కాంగ్రెస్‌లను విభేదిస్తున్న పార్టీలను కలిపి కేసీఆర్ ఓ రాజకీయ పార్టీని పెట్టినా పెట్టవచ్చని అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అంటున్న మోదీ కూడా ఖుషీ అవుతారాన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇందతా వినడానికి గులాబి శ్రేణులకు ఎనలేని సంతోసాన్ని కల్గిస్తున్నా.. ఈ కల నిజం కావాలంటే.. మాత్రం అంతా ఈజీ కాదని అంటున్నారు. అయినా ఇప్పటికి ఇలా ఊహాలోకంలో విహరిస్తామంటూ టీఆర్‌ఎస్ శ్రేణులు తేల్చిపారేస్తున్నాయి.