kurinji andavar temple : 12ఏళ్లకు ఒకసారి పూసే ‘నీలకురింజు పువ్వుల’ పేరుతో దేవాయలం..
12 ఏళ్లకు ఒక్కసారి పూసే అత్యంత అరుదైన పువ్వులు నీలకురింజి పువ్వులు. భారతదేశంలోని నీలగిరి పర్వతాలపై మాత్రమే పూసే ఈ పువ్వుల సోయగాలను చూడాలంటే కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వెళ్లాల్సిందే. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పువ్వుల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీలగిరి పర్వతాలపై నిలబడి నీలకురింజి పువ్వుల అందాలను చూడటం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అటువంటి అరుదైన..అద్భుతమైన ‘నీలకురింజి’పేరుతో ఓ దేవాలయం ఉంది.

kurinji andavar temple
kurinji andavar temple : 12 ఏళ్లకు ఒక్కసారి పూసే అత్యంత అరుదైన పువ్వులు నీలకురింజి పువ్వులు. భారతదేశంలోని నీలగిరి పర్వతాలపై మాత్రమే పూసే ఈ పువ్వుల సోయగాలను చూడాలంటే కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వెళ్లాల్సిందే. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పువ్వుల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీలగిరి పర్వతాలపై నిలబడి నీలకురింజి పువ్వుల అందాలను చూడటం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అటువంటి అరుదైన..అద్భుతమైన ‘నీలకురింజి’పేరుతో ఓ దేవాలయం ఉంది.
హిల్ స్టేషన్ అయిన కొడైకెనాల్ లో ఉందీ కురింజి అండవర్ దేవాలయం కొడైకెనాల్ సరస్సుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాయలంలో శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు. మురుగన్ అంటే సుబ్రమణ్యస్వామి. కురింజి అంటే పర్వతం అని అర్థం. అండవర్ అంటే దేవత లేదా దేవుడు అని అర్థం. కురింజి అండవార్ అంటే పర్వత దేవుడు అని అర్థం. కుమారస్వామి కైలాసం నుంచి మొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు ఈ పర్వతం మీదనే దిగాడట.
NeelaKurinkji : 12 ఏళ్లకు పూసే ‘నీలకురింజి’ పువ్వులు.. నీలిరంగులో వెలిగిపోతున్న షాలోం కొండలు
అప్పుడు కుమారస్వామి భార్య వల్లీ ఆయన్ని 12 ఏళ్లకు ఒక్కసారి పూసే నీలకురంజి పువ్వుల దండతో మెడలో వేసి స్వాగతం పలికిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం కూడా నీలకురింజి పువ్వుల లాగే నీలం రంగులోనే ఉండటం విశేషం. శ్రీ కురింజి ఈశ్వరన్ దేవాలయం 1936 లో నిర్మించబడింది. హిందూ ధర్మాన్ని స్వీకరించిన ఒక యూరోపియన్ అమ్మాయి ఈ ఆలయాన్ని నిర్మించిందని చెబుతుంటారు. ఈ అమ్మాయి హిందువుల అబ్బాయిని పెళ్లి చేసుకుందట.