2,416 మంది పోలీసులకు కరోనా వైరస్

మహమ్మారి కరోనా వైరస్.. భారత్‌లో విజృంభిస్తోండగా.. మహారాష్ట్రలో ఉగ్రరూపం దాలుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా కట్టడి చెయ్యడంపై ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కరోనా సమయంలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు, డాక్టర్లకు కూడా ఈ వ్యాధి సోకడంతో ఇప్పుడు భయాందోళనలు మొదలయ్యాయి.
గత 24 గంటల్లో కొత్తగా 91మంది రాష్ట్ర పోలీసులకు కరోనా సోకగా.. రాష్ట్రంలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 2,416కి చేరింది. సుమారు వెయ్యి మంది పోలీసులు కూడా కోలుకోగా.. మహారాష్ట్ర పోలీసులలో ఇప్పుడు 1421 క్రియాశీల కేసులు ఉన్నాయి. వాటిలో 183 పోలీసు అధికారులు మరియు 1238 కానిస్టేబుల్ ర్యాంక్ సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ 26 మంది పోలీసులు మరణించారు.
కోవిడ్ -19తో బాధపడుతున్న మహారాష్ట్రలో చనిపోయిన 26 మంది పోలీసులలో 16 మంది ముంబైకి చెందినవారు. ముగ్గురు నాసిక్ రూరల్, పూణే నుండి ఇద్దరు మరియు సోలాపూర్ సిటీ, సోలాపూర్ రూరల్, థానే మరియు ముంబై ఎటిఎస్ నుండి ఒకరు. ఆరోగ్య శాఖ ప్రకారం, మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 62,228కు పెరిగింది. అందులో ముంబైలో 36,932 కేసులు నమోదయ్యాయి. కరోనా నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 2,098 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 1,173 మరణాలు ముంబైలో జరిగాయి.