Lemon Juice: విషాదం: కరోనా రాకూడదని ముక్కులో నిమ్మరసం పోసుకున్నాడు

Lemon Juice: విషాదం: కరోనా రాకూడదని ముక్కులో నిమ్మరసం పోసుకున్నాడు

Lemon Juice

Updated On : April 29, 2021 / 2:30 PM IST

Lemon Juice: కరోనా ఉదృతి పెరుగుతున్న వేళ ప్రజలు అనేక రకాల ఆహారాలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం పండ్లను అధికంగా తింటున్నారు. ఇక తేనే నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని చాలామంది సేవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ఉపాద్యాయుడు చేసిన పని తన ప్రాణాలు తీసింది. నిమ్మరసం ముక్కులోకి పిండుకుంటే ఉపిరితిత్తుల్లోని కఫం బయటకు పడి కరోనా బారిన పడకుండా ఉండొచ్చనే ఆశతో ఉపాధ్యాయుడు బసవరాజ్‌(43) నిమ్మరసం పిండుకున్నాడు..

దీంతో ఆయన అస్వస్థతకు గురై మరణించాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బసవరాజ్ కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరులోని శరణ బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. బసవరాజ్ మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటన విషయం తెలుసుకున్న వైద్యులు కరోనాకు ఇంటివైద్యం చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లోకి వాటర్ వెళ్తే చాలా ప్రమాదం అని తెలిపారు..