Lemon: మార్కెట్లో కళ్లుగప్పి నిమ్మకాయలు చోరీ
కాదేదీ దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు. విలువైనవి ఏమైనా సరే లూటీ చేసేయడమే. నిమ్మకాయలు ధరలు ఆకాశన్నంటడంతో రూ 70వేల విలువైన 12 సంచుల నిమ్మకాయలను దొంగలు చోరీ చేశారు.

Soaring Lemon Prices
Lemon: కాదేదీ దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు. విలువైనవి ఏమైనా సరే లూటీ చేసేయడమే. నిమ్మకాయలు ధరలు ఆకాశన్నంటడంతో రూ 70వేల విలువైన 12 సంచుల నిమ్మకాయలను దొంగలు చోరీ చేశారు. యూపీలోని ఘజియాబాద్ కూరగాయల మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది.
పైగా అక్కడున్న కూరగాయాలు వేటిని ముట్టుకోకుండా.. నిమ్మకాయలను మాత్రమే తీసుకెళ్లారు. భోజ్‌పూర్‌కు చెందిన రషీద్ స్ధానిక మార్కెట్‌లో కూరగాయల షాపు నిర్వహిస్తుండగా అతడి షాప్ నుంచి దొంగలు నిమ్మకాయలతో ఉడాయించారు. నిమ్మకాయలు కనిపించకపోవడంతో రషీద్ విలువైన సరుకుపోయిందని అధికారులకు ఫిర్యాదు చేశాడు.
కూరగాయల ధరలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డును కూడా నియమించారు. అతని కళ్లుగప్పి దొంగలు లూటీకి పాల్పడ్డారు. షాహజన్‌పూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇదే తరహా ఘటన నమోదైంది. కూరగాయల వ్యాపారి గోడౌన్ నుంచి దొంగలు 60 కిలోల నిమ్మకాయలు, 40 కిలోల ఉల్లిగడ్డలు, 38 కిలోల వెల్లుల్లిని దొంగిలించి పరారయ్యారు.