విద్యార్థుల మన్‌ కీ బాత్‌ వినండి…పరీక్షలు వాయిదా వేయండి

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2020 / 03:55 PM IST
విద్యార్థుల మన్‌ కీ బాత్‌ వినండి…పరీక్షలు వాయిదా వేయండి

Updated On : August 23, 2020 / 4:04 PM IST

నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సిన నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ;విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను ఈ నెల 17న సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 1-16 మధ్య జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).

అయితే, కరోనా వేళ పరీక్షలు రాయలేని లక్షలాది మంది విద్యార్థుల ఆవేదనను వినాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు రాహల్. గత కొద్ది రోజులుగా ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) (మెయిన్) , నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) (యూజీ) సెప్టెంబర్ 13న జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. నేడు లక్షల మంది విద్యార్థులు ఏదో చెబుతున్నారు. నీట్, జేఈఈ పరీక్షల గురించి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా విద్యార్థుల కీ మన్ కీ బాత్ విని, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి అని రాహుల్ ట్వీట్‌ చేశారు.

కాగా,శనివారం ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కూడా కేంద్ర ప్రభుత్వం జేఈఈ, నీట్ రద్దు చేయాలని కోరారు. ఈ రెండు పరీక్షలను వెంటనే రద్దు చేసి ఈ ఏడాది అడ్మిషన్లకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి నా విన్నపం అని సిసోడియా ట్వీట్ చేశారు.