Punjab Election : సిద్ధూతో మంతనాలు..కాంగ్రెస్ లోకి హర్భజన్ సింగ్!

పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు క్రికెట‌ర్ల‌ను ఆకర్షించే పనిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ బీజేపీలో చేర‌బోతున్నా

Punjab Election : సిద్ధూతో మంతనాలు..కాంగ్రెస్ లోకి హర్భజన్ సింగ్!

Sidhu (1)

Updated On : December 15, 2021 / 8:28 PM IST

Punjab Election : పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు క్రికెట‌ర్ల‌ను ఆకర్షించే పనిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ బీజేపీలో చేర‌బోతున్నార‌ని వార్త‌లొచ్చాయి. అయితే వాటిపై యువ‌రాజ్ ఎలాంటి వ్యాఖ్య‌లూ చేయ‌లేదు. మ‌రోవైపు, కాంగ్రెస్ పార్టీ.. హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ కు గాలం వేస్తోన్నట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలు.. హర్భజన్ సింగ్ త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడని తెలియజేస్తున్నాయి.

హర్భజన్ సింగ్ బుధవారం పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూని కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన సిద్ధూ..”సాధ్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్న ఫొటో” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ లో భజ్జీ చేరిక ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌జ్జీని జ‌లంధ‌ర్ నుంచి కాంగ్రెస్ బ‌రిలో దింపే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

అయితే మొన్న‌టికి మొన్న హర్భజన్ సింగ్ బీజేపీలో చేరిపోతున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇదంతా పుకారే అని భజ్జీనే స్వ‌యంగా కొట్టిపారేశారు. ఇక, తాజాగా కాంగ్రెస్ లో చేరబోతున్నాడన్న ప్రచారంపై హర్భజన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.