స్కూల్ లోకి సింహం…హడలిపోయిన గ్రామస్థులు

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 06:06 AM IST
స్కూల్ లోకి సింహం…హడలిపోయిన గ్రామస్థులు

Updated On : May 3, 2020 / 6:06 AM IST

కరోనావైరస్ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఫలితంగా మనుషులందరూ తమ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ లేకుండా రోడ్లు ఖాళీగా ఉండటంతో వన్యప్రాణులకు రోడ్లపై హాయిగా తిరిగే అవకాశం లభించింది.

 

ఫారెస్ట్ ఏరియాకు దగ్గర్లోని ప్రాంతాలలో అడవిమృగాలు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇటీవల తిరుమలలో కూడా అడవిమృగాలు రోడ్లపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు గుజరాత్ లోని ఓ పాఠశాలలోకి సింహం వచ్చింది.

గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ఉనా గ్రామంలోని ఓ స్కూల్ ఆవరణలో బుధవారం ఉదయం ఓ సింహం తిరుగుతూ కన్పించింది. దగ్గర్లోని షెడ్ దగ్గర జింకను వేటాడుతూ స్కూల్ ఆవరణలోకి సింహం వచ్చింది. స్కూల్ బిల్డింగ్ లోపల కూడా తిరగం మొదలుపెట్టింది ఆ సింహం. అయితే వెంటనే అక్కడున్నవాళ్లు ఓ పైపు సాయంతో గేట్లను మూసివేయడంతో స్కూల్ బిల్డింగ్ లో చిక్కుకుపోయింది సింహం. స్కూల్ ది శిధిలమైన గేటు కావడంతో ఆ సింహం ఆ గేటుని బద్దలుకొట్టి బయటకు రాలేకపోయింది.

అయితే వెంటనే అక్కుడున్న సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వాళ్లు స్కూల్ ఆవరణలో ఉన్న సింహాన్ని బోనులో బంధించి జసధర్ ఎనిమల్ కేర్ సెంటర్ కు తీసుకెళ్లి రొటీన్ టెస్ట్ తర్వాత దానిని అడవికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. సింహం వల్ల ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.