Warning For Pakistan: ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం.. ఖబర్దార్..! పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ మాస్ వార్నింగ్..

ఆపరేషన్‌ సిందూర్‌ 1.0 లో ఉన్నట్లు ఈసారి సంయమనం పాటించమన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు.

Warning For Pakistan: ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం.. ఖబర్దార్..! పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ మాస్ వార్నింగ్..

Updated On : October 3, 2025 / 5:49 PM IST

Warning For Pakistan: పాకిస్తాన్ కు భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం ఆపేయాలన్నారు. లేకపోతే పాక్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. రాజస్థాన్‌లోని అనుప్‌గఢ్‌ ఆర్మీ పోస్టును సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. ఈ క్రమంలో దాయాదిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్న ఆయన.. దేవుడు అనుమతిస్తే త్వరలోనే అలాంటి అవకాశం లభిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. సైనికులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సర్వ సన్నద్ధంగా ఉండాలన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ 1.0 లో ఉన్నట్లు ఈసారి సంయమనం పాటించమన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు. పాకిస్థాన్‌పై మరింత తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ద్వివేది తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌ ఉనికిపై ఆలోచించే విధంగా తమ చర్యలు ఉంటాయన్నారు. భూమిపై ఉండాలనుకుంటే.. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ ఆపాల్సిందే అని భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.

ఇండియన్ ఆర్మీ చీఫ్ ద్వివేది చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.O ఉంటుందేమో అన్న సంకేతాలు ఇచ్చే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలువరించాల్సిందేనని లేదంటే పాక్ ను ఈ భూమి మీదే లేకుండా చేస్తామన్నారు. సైన్యం సిద్ధంగా ఉండాలంటూ కీలక ఆదేశాలు ఇచ్చారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది.

Also Read: ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు.. అతని ఆస్తుల విలువెంతో తెలుసా..? భూమ్మీద అతనే టాప్.. తాజా లెక్కలివే..