గుడ్ న్యూస్… భారీగా తగ్గిన LPG సిలిండర్ ధరలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2020 / 01:13 PM IST
గుడ్ న్యూస్… భారీగా తగ్గిన LPG సిలిండర్ ధరలు

Updated On : March 1, 2020 / 1:13 PM IST

వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. గతేడాది ఆగస్టు నుంచి వరుసగా ఆరు నెలలుగా పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు ఈ మార్చి నెలలో తగ్గాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం…మార్చి 1 (ఆదివారం) నుంచి నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు ఢిల్లీ, ముంబైలో 14.2కిలోల సిలిండర్‌పై రూ.53 తగ్గింది. గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు సుమారు 50 శాతం వరకు ఆరు దశలుగా పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు తొలిసారిగా భారీగా తగ్గడం గమనార్హం.

దేశరాజధాని ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఇంతకు ముందు రూ. 858.50 ఉండగా,ఇవాళ(మార్చి-1,2020)నుంచి ఇప్పుడు 805.5గా ఉంది. కోల్‌కతాలో ఇంతకుముందు రూ. 896.00 ఉండగా, ఇప్పుడు 839.5గా ఉంది. ముంబైలో ఇంతకుముందు రూ.829.50 ఉండగా, ఇప్పుడు 776.5గా ఉంది. చెన్నైలో నాన్ సబ్సిడీ ఎల్పీ సిలిండర్ ధర రూ. 881.00 ఉండగా.. ఇప్పుడు రూ. 826కు తగ్గింది.

సబ్సిడీ సిలిండర్ల కంటే ఎక్కువ వాడితే.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు ఢిల్లీలో ఇంతకు ముందు 1,466.00గా ఉండగా.. ఇప్పుడు రూ. 1,381.00గా ఉంది. ముంబైలో రూ. 1540.50 ఉండగా.. రూ. 1331.50 తగ్గింది. ప్రతి నెలా వంట గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఒక్కో వినియోగదారుడు ఏడాదికి గరిష్టంగా 12 సిలిండర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. అంతకు మించి వాడితే సబ్సిడీ లేకుండానే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.