ప్రాణాలు తీసిన వరుస కాన్పులు : 16వ ప్రసవంలో తల్లీ బిడ్డలు మృతి

  • Published By: nagamani ,Published On : October 12, 2020 / 12:57 PM IST
ప్రాణాలు తీసిన వరుస కాన్పులు : 16వ ప్రసవంలో తల్లీ బిడ్డలు మృతి

Updated On : October 12, 2020 / 1:15 PM IST

madhya pradesh : ఒకరు లేక ఇద్దరు పిల్లలు..ప్రతీ ఇంటికీ ఆరోగ్యకరం. తల్లీ బిడ్డలతో పాటు ఆ ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అవుతుందని పెద్దలు చెప్పిన సామెత. ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఆ తల్లి ఆరోగ్యంకూడా పాడైపోతుంది.ప్రాణాలే పోయే ప్రమాదం జరగుతుంది.సరిగ్గా అదే జరింగింది మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ విషయంలో.



మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో సుఖ్రానీ అహిర్‌వార్ అనే 45 ఏళ్ల మహిళ తన 16 వ బిడ్డకు జన్మనిచ్చింది..కానీ ప్రసవించిన కొద్దిసేపటికే తల్లీ బిడ్డా మరణించారు. ఈ విషయాన్ని స్థానిక ఆరోగ్య కార్యకర్త ఆదివారం (అక్టోబర్ 11,2020) తెలిపారు.


దీనిపై స్థానిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) కల్లోబాయి విశ్వర్మ మాట్లాడుతూ..పదాజిర్ గ్రామానికి చెందిన సుఖ్రానీ అహిర్‌వార్ శనివారం తన ఇంట్లోనే ప్రసవించిందని..కానీ తల్లీ పసిబిడ్డ పరిస్థితి విషమించటంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవటంతో వారిద్దరూ వారిద్దరూ చనిపోయారని తెలిపింది.


కాగా.. అహిర్వార్ అప్పటికే 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది..వారిలో ఏడుగురు బిడ్డలు చనిపోయారు. అహిర్వార్ కు ఇది 16వ ప్రసవం. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో 16వ బిడ్డను ప్రసవించటంతో తల్లీబిడ్డలు మృతి చెందారని తెలిపింది. ఈ సంఘటనను జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది ధృవీకరించారు.