Cop Gives CPR To Snake : పాముకు సీపీఆర్ చేసి ప్రాణంపోసిన పోలీస్..! వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మ పచ్‌మర్హి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం దసరా రోజు డ్యూటీ ఉన్న తనకు

Snake
Madhya Pradesh Cop: మీరెప్పుడైన సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్ ) చేయడం చూశారా? అంటే.. గుండె పనితీరు అకస్మాత్తుగా ఆగిపోయేటప్పుడు.. ఆగిపోయిన వారికి వెంటనే పంప్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఊపిరితిత్తులు ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకునేలా చేయాలి. ఇందుకోసం పేషంట్ నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందించాల్సి ఉంటుంది.. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? ఎక్కువగా మనుషులకు ఈ సీపీఆర్ చేయడం చూస్తూనే ఉంటాం కదూ.. కానీ ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజమేనండీ బాబూ.. మీరు నమ్మలేకపోతే ఇందుకు సంబంధించిన వీడియో చూడండి.. ఆశ్చర్య పోవడం ఖాయం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మ పచ్‌మర్హి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం దసరా రోజు డ్యూటీలో ఉన్న తనకు నర్మదాపురంలోని తవా కాలనీ వాసులు తమ ఇంట్లోకి పాము వచ్చిందని ఫోన్ చేశారు. దీంతో అతను పాము ఉన్న ఇంటికి వెళ్లిచూడగా.. పాము పైపులో దాక్కొని ఉంది. అయితే, కుటుంబ సభ్యులు అప్పటికే పురుగుల మందులు కలిపిన నీటిని బకెట్ తో పోశారు.. దీంతో పాము విషపు నీటిలో స్పృహతప్పి పడిపోయింది. అతుల్ శర్మ స్వతహాగా పాముల రక్షకుడు. వెంటనే అతడు పామును బయటకుతీసి దాని నోటిని కడిగి తరువాత సీపీఆర్ అందించాడు.
Also Read : Diesel Tanker: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. క్యాన్లకు పనిచెప్పిన స్థానికులు.. వీడియో వైరల్
పాము నోటి వద్ద తన నోటిని ఉంచి గాలి అందించాడు. అలా కొద్దిసేపు చేసినతరువాత ప్రాము స్పృహలోకి వచ్చింది. పాము స్పృహలోకి రావడానికి దాదాపు గంట సమయం పట్టింది. ఆ తరువాత శర్మ దానిని తీసుకెళ్లి అడవిలో వదిలివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతుల్ శర్మకు నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తుంది. అయితే.. స్థానికంగా పశువైద్యుడి వాదన మరోలా ఉంది.. పాముకు సాంప్రదాయక సీపీఆర్ ని అందించడం నిజంగా పనిచేయదని, తాత్కాలికంగా అపస్మారక స్థితికి చేరిన తరువాత పాము తనను తాను పునరుద్దరించుకునే అవకాశం ఉందని స్థానిక పశువైద్యుడు పేర్కొన్నాడు. ఏదిఎలా ఉన్నా.. పామును రక్షించేందుకు కానిస్టేబుల్ చేసిన ప్రయత్నంను నెటిజన్లు అభినందిస్తున్నారు.
A video from Narmadapuram has gone viral where a police constable is giving CPR to a snake that had fallen unconscious after being drenched in pesticide laced toxic water. pic.twitter.com/tblKDG06X6
— Anurag Dwary (@Anurag_Dwary) October 26, 2023