Diesel Tanker: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. క్యాన్లకు పనిచెప్పిన స్థానికులు.. వీడియో వైరల్

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్లమిట్ట వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. కారును తప్పించబోయి ప్రమాదవశాత్తూ..

Diesel Tanker: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. క్యాన్లకు పనిచెప్పిన స్థానికులు.. వీడియో వైరల్

Diesel Tanker Overturned in Annamayya District

Updated On : October 26, 2023 / 11:35 AM IST

Diesel Tanker Overturned : అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్లమిట్ట వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. కారును తప్పించబోయి ప్రమాదవశాత్తూ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ట్యాంకర్ పీలేరు నుంచి రాయచూరు వైపు వెళ్తున్నట్లు తెలిసింది. ట్యాంకర్ పూర్తిగా పడిపోవటంతో ట్యాంకర్ లో నుంచి డీజిల్ కారుతూ ఉంది.

ఇదే అదునుగా స్థానికులు కొందరు క్యాన్లకు పనిచెప్పారు. క్యాన్లను తీసుకొచ్చి డీజిల్ నింపుకొని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ట్యాంకర్ బోల్తాకొట్టిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.