Narottam Mishra: షబానా అజ్మి, నసీరుద్దీన్ షాలపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Madhya Pradesh minister makes controversy on Shabana Azmi and Naseeruddin Shah
Narottam Mishra: బాలీవుడ్ నటి షబానా అజ్మీతో పాటు సినీ రచయిత జావేద్ అఖ్తర్, నటుడు నసీరుద్దీన్ షాలపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి, బీజేపీ నేత నరోత్తం మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారంతా ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్, స్లీపర్ సెల్ ఏజెంట్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపేలా ఉన్నాయి. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్పందించారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ వివాదాస్పదంగా మాట్లాడారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే వీరంతా మాట్లాడేందుకు చాలా ఆసక్తి చూపిస్తారని, అయితే మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగినా అసలేం పట్టనట్లు ఉంటారని నరోత్తం మిశ్రా విమర్శించారు. రాజస్థాన్‌లో కన్హయ్య లాల్‌ను హత్య చేశారని, అప్పుడు వారి నోటి నుంచి ఒక్క మాట కూడా లేదని, జార్ఖండ్‌లోని దుమ్కాలో బాలికను సజీవ దహనం చేసిన సమయంలో మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు. వీరంతా సెక్యూలర్ అని చెప్పుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
Kejriwal at Gujarat: బీజేపీలోనే ఉండండి, కానీ ఆప్ కోసం పని చేయండి: కేజ్రీవాల్ పిలుపు