Assembly Elections 2023 Results : మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీదే హవా.. ఘోర పరాభవం పాలైన కాంగ్రెస్

మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్పష్టమైన మెజారిటీ మార్కును దాటింది. లెక్కింపు పూర్తిగా ముగిసేనాటికి భారీ మెజారిటీనే బీజేపీ మూటకట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Assembly Elections 2023 Results : మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీదే హవా.. ఘోర పరాభవం పాలైన కాంగ్రెస్

3 states Assembly Elections 2023 Results

Updated On : December 3, 2023 / 10:01 PM IST

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లలో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికి విడుదలైన ఫలితాల ప్రకారం.. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్పష్టమైన మెజారిటీ మార్కును దాటింది. లెక్కింపు పూర్తిగా ముగిసేనాటికి భారీ మెజారిటీనే బీజేపీ మూటకట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 03 Dec 2023 08:07 PM (IST)

    కాంగ్రెస్, బీజేపీలకు కంగ్రాట్స్ చెప్పిన ఏపీ సీఎం

    నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా.. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీకి.. అలాగే తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయమై ఆయన ఆదివారం ఫలితాలు వచ్చిన అనంతరమే తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈ శుభాకాంక్షలు తెలియజేశారు.

  • 03 Dec 2023 06:05 PM (IST)

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన అశోక్ గెహ్లాట్

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల తీర్పును స్వీకరిస్తున్నామనియ తెలిపారు. నిజానికి ఇది ఎవరూ ఊహించని పరిణామమని అన్నారు. తమ ప్రణాళికలు, చట్టాలు ఆవిష్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము పూర్తిగా విజయం సాధించలేకపోయామని ఈ ఓటమి తెలియజేస్తోందని అన్నారు. కష్టపడి పని చేసినప్పటికీ విజయం సాధించలేకపోయామని గెహ్లాట్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • 03 Dec 2023 04:58 PM (IST)

    మూడు రాష్ట్రాల్లోను తగ్గేదేలేదంటున్న బీజేపీ..గెలుపు నామమాత్రమే..

    మధ్యప్రదేశ్ : 230 స్థానాలకు బీజేపీ 166, కాంగ్రెస్ 63, ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.
    ఛత్తీస్ గఢ్ : 90 స్థానాలకు బీజేపీ 57, కాంగ్రెస్ 33 ఆధిక్యంలో ఉన్నారు.
    రాజస్థాన్ : 199 స్థానాలకు బీజేపీ 115, కాంగ్రెస్ 69 ఆధిక్యంలో ఉన్నారు.బీఎస్పీ2, ఇతరులు 13 స్థానాల్లో కొనసాగుతున్నారు.

  • 03 Dec 2023 04:36 PM (IST)

    మేము అస్సలు ఊహించలేదు : ఒమర్ అబ్దుల్లా

    ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న క్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, జమ్ముకశ్మీర్మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. కాంగ్రెస్ గెలుపు సులభం అని అనుకున్నాం. కానీ బీజేపీ ఈ ఆధిక్యాన్ని తాము ఊహించలేదన్నారు. బీజేపీని అభినందించాలన్నారు. ఫలితాలన్నీ ఊహకు అందకుండా తారుమారు అయిపోయాయని అన్నారు.

     

  • 03 Dec 2023 04:08 PM (IST)

    రాజస్థాన్‌లో మరో బీజేపీ అభ్యర్థి దియా కుమారి విజయం

    రాజస్థాన్ లో విజయ దుంధుభి మోగిస్తున్న కమలం పార్టీ మరో అభ్యర్థి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే మాజీ సీఎం వసుంధరా రాజే విజయం సాధించారు. వసుంధరా రాజే 53,193 ఓట్ల‌ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె మొత్తం 1,38,831 ఓట్లు సాధించి విజయం సాధించారు.

    ఈక్రమంలో మరో బీజేపీ అభ్యర్థి, బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి 71,368 ఓట్ల తేడాతో మొత్తం 1,58,516 ఓట్లను సాధించారు.

    రాజస్థాన్ లో ఇప్పటికే బీజేపీ 114 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తు విజయాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 12 స్థానాల్లో ఉన్నారు.

     

  • 03 Dec 2023 03:52 PM (IST)

    ఏమాత్రం తగ్గని బీజేపీ హవా..

    ఛత్తీస్ గడ్ : 90 స్థానాలకు బీజేపీ 53, కాంగ్రెస్ 35 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉండగా ఇతరులు 2 స్థానాల్లో ఉన్నారు.

    మధ్యప్రదేశ్ : 230 స్థానాలకు బీజేపీ 166 స్థానాల్లోను..కాంగ్రెస్ 62 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నారు ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    రాజస్థాన్ : 199 స్థానాలకు బీజేపీ 115, కాంగ్రెస్ 69 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ..ఇతరులు 12మంది అభ్యర్దులు ఆధిక్యంలో ఉన్నారు.

    ఏది ఏమైనా..ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ హవా కొనసాగుతోంది.

  • 03 Dec 2023 03:27 PM (IST)

    మా చౌహాన్ హనుమంతుడు

    మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక గెలుపు నామమాత్రంగా ఉంది.దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు నేతలు,కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఫ్లెక్సీలో చౌహాన్ సింగ్ ను హనుమంతుడు గెటప్ లో చిత్రీకరించారు. పాలాభిషేకం చేశారు.

     

  • 03 Dec 2023 03:20 PM (IST)

    జైపూర్‌ లో కాషాయదళం గెలుపు సంబరాలు..

    రాజస్థాన్ లో ఇక బీజేపీ గెలుపు నామమాత్రమే. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 70 స్థానాల్లోను..ఉన్నారు. దీంతో ఇక బీజేపీ గెలుపు దాదాపు ఖరారు అయినట్లే. దీంతో రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సిపి జోషి, కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర పార్టీ నాయకులు జైపూర్‌లోని పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన నేతలు,కార్యకర్తలపై పూలు జల్లి సంబరాలు చేసుకున్నారు.

     

  • 03 Dec 2023 03:00 PM (IST)

    53,193 ఓట్ల‌ ఆధిక్యంతో రాజస్థాన్ మాజీ సీఎం వ‌సుంధ‌రా రాజే విజ‌యం

    రాజ‌స్థాన్ మాజీ సీఎం వసుంధ‌రా రాజే విజ‌యం సాధించారు. ఝల్రాపటన్ స్థానం నుంచి పోటీలో ఉన్న ఆమె కౌంటింగ్ ప్రారంభం నుంచి ఆధిక్యంలో కొనసాగారు. 53,193 ఓట్ల‌తో ఆమె విజయం సాధించారు. 2003 నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా ఆ స్థానం నుంచే ఆమె పోటీ చేస్తున్న ఆమె మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

    గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌న్వేంద్ర సింగ్‌పై 35వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించిన ఆమె 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూడా సత్తా చాటారు. ఆమె విజయం సాధించటంతో మరి ఆమరో మరోసారి సీఎం అవుతారా..? అధిష్టానం ఆమెకు మరోసారి సీఎం పీఠాన్ని ఇస్తుందా.??లేదో వేచి చూడాలి..కాగా ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ 199 స్థానాలకు బీజేపీ 111 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ ఇక గెలుపు నామమాత్రంగానే ఉంది. ఈక్రమంలో బీజేపీ విజయం సాధిస్తే..వసుంధర విజయం సాధించటంతో మరోసారి సీఎం అవుతారా.. లేదో వేచి చూడాలి.

  • 03 Dec 2023 02:48 PM (IST)

    బీజేపీ దరిదాపులకు కూడా రాలేకపోతున్న కాంగ్రెస్..గెలుపు ఖారారు చేసుకునే హవాలో బీజేపీ

    మధ్యప్రదేశ్ : 230 స్థానాలకు బీజేపీ 162, కాంగ్రెస్ 65, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
    ఛత్తీస్ గఢ్ : 90 స్థానాలకు బీజేపీ 55, కాంగ్రెస్ 32 ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
    రాజస్థాన్ : 199 స్థానాలకు బీజేపీ 111, కాంగ్రెస్ 73, ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 03 Dec 2023 02:08 PM (IST)

    భోపాల్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మహిళల అభినందనలు

    మధ్యప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంతో దూసుకుపోతుండటంతో సీఎం శివరాజ్ సింగ్ మద్దతుదారులు గులాబీ పూలు పట్టుకుని సినిమా పాట పాడుతు సంబరాలు జరుపుకున్నారు. మహిళలు ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుని పూలు జల్లుకుని సంబరాలు జరుపుకున్నారు.సీఎం శివరాజ్ సింగ్ కు పూల దండ వేసి అభినందనలు తెలిపారు. అన్నదమ్ముల అనుబంధంపై ఉన్న 'ఫూలోన్ కా తారోన్ కా...' సినిమా పాటలను పాడారు.

     

  • 03 Dec 2023 02:00 PM (IST)

    మోదీపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితాలు ప్రతీక : స్మృతి ఇరానీ

    ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో బీజేపీ ఆధిక్యంపై కేంద్ర మంత్రి, పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ ఆనందం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు.. ఆయన ప్రజలు ఉంచిన నమ్మకానికి ఇది ప్రతీక అని అన్నారు. ఈ ఫలితాలకు బీజేపీ కార్యకర్తలుగా మేము ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మోదీపై గాంధీ కుటుంబం చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పనిచేయలేదని అన్నారు.

     

  • 03 Dec 2023 01:47 PM (IST)

    రాజస్థాన్‌లో BAP అభ్యర్థి రాజ్‌కుమార్ రోట్ విజయం

    దుంగార్‌పూర్ జిల్లాలోని చోరాసి స్థానం నుంచి భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రోట్ 1,11,150 ఓట్లతో విజయం సాధించారు.

    కాగా..రాజస్థాన్ లో 199 స్థానాలకు బీజేపీ 113 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇతరులు 13స్థానాల్లో ఉన్నారు.

  • 03 Dec 2023 01:39 PM (IST)

    ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న కమలం..సబరాల్లో BJP నేతలు

    మధ్యప్రదేశ్ : 230 స్థానాలకు బీజేపీ 162, కాంగ్రెస్ 65, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
    ఛత్తీస్ గఢ్ : 90 స్థానాలకు బీజేపీ 53, కాంగ్రెస్ 34 ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
    రాజస్థాన్ : 199 స్థానాలకు బీజేపీ 112, కాంగ్రెస్ 71, ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 03 Dec 2023 01:22 PM (IST)

    గెలుపు దిశగా బీజేపీ ..కమలం నేతల సంబరాలు..

    మధ్యప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి గెలుపును దాదాపు ఖరారు చేసుకుంది. ఈ సంతోషాన్ని బీజేపీ నేతలు మిఠాయిలు పంచుకుంటు సంబరాలు జరుపుకుంటున్నారు. దీంట్లో భాగంగా..కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు పార్టీ నాయకులు స్వీట్లు తినిపించారు.

     

     

     

    మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అశ్విని వైష్ణవ్‌లు స్వీట్లు తినిపించుకున్నారు.

  • 03 Dec 2023 01:00 PM (IST)

    అంతకంతకు దిగజారిపోతున్న కాంగ్రెస్ ఆధిక్యం .. దూసుకుపోతున్న బీజేపీ

    మధ్యప్రదేశ్,చత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ మధ్యప్రదేశ్ లో 163 స్థానాల్లో దూసుకుపోతోంది. కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయింది. బీజేపీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతోంది. 65 స్థానాల్లో మాత్రం ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక బీజేపీ హవా కొనసాగుతుండటంతో ఇతరులు ఆధిక్యం సంఖ్య తగ్గిపోతోంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు బీజేపీ ఏకంగా 163 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

    ఇక ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలకు బీజేపీ 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతకంతకు చతికిలపడుతు ప్రస్తుతం 36 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

    రాజస్థాన్ లో కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. 199 స్థానాలకు బీజేపీ 114 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంటే..కాంగ్రెస్ 70 స్థానాల్లో ఉంది. ఇతరులు 13స్థానాల్లో ఉన్నారు.

  • 03 Dec 2023 12:44 PM (IST)

    ఆధిక్యంలో హవా చూపిస్తున్న వసుంధరా రాజే మళ్లీ సీఎం అవుతారా..?!

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేయటంతో ఇక బీజేపీ విజయం ఖరారు అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ నాయకురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ నుండి ఆధిక్యంలో కొసాగుతున్నారు. వసుంధర రాజేకి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన రామ్‌లాల్ చౌహాన్ సవాల్ ఏమాత్రం సత్తా చూపించలేకపోతున్నారు.

    వంసుధ రాజే 2003 నుండి ఝలావర్ జిల్లాలోని ఝల్రాపతన్ అసెంబ్లీ సీటును సాధిస్తునే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా అదే హవాను కొనసాగిస్తున్నారు. దీంతో వసుంధర రాజే మరోసారి సీఎం కావావలని ఆశిస్తున్నారు. ఆమె కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా..తాజాగా ఆమె మరోసారి అదే స్థానం నుంచి గెలిచే అవకాశం ఉండటంతో సీఎం కుర్చీని ఆశిస్తున్నారు.

    రాజస్థాన్ లో మొత్తం 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 111 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 70 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇతరులు 17 చోట్ల మందంజలో ఉన్నారు.

    రాజస్థాన్ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా మెజారిటీ మార్కు 100కు చేరుకోవాలి. రాజస్థాన్ లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తే వసంధర రాజే మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారు. మరి బీజేపీ హైకమాండ్ వసుంధర రాజేకి మరో చాన్స్ ఇస్తుందా..? లేదా కొత్తగా ఎవరినైనా తెరమీదకు తెస్తుందా..? వేచి చూడాలి. బీజేపీ గెలుపు దిశగా దూసుకుపోతున్న క్రమంలో సీఎం ఎవరు..? అనేదానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

     

     

  • 03 Dec 2023 11:59 AM (IST)

    24,000 ఓట్ల ఆధిక్యంలో వసుంధర రాజే

    బీజేపీ నాయకురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 24,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వసుంధర రాజే ఝలర్‌పతన్‌లో 24 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు.

  • 03 Dec 2023 11:55 AM (IST)

    మూడు రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కమలం

    మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో బీజేపీ హవా కొనసాగుతోంది. అంతకంతకు కాంగ్రెస్ పై పైచేయి సాధిస్తోంది. ఇప్పటికే మ్యాజిగ్ ఫిగర్ దాటేసింది.

    మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో 230 స్థానాలకు బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కానంగ్రెస్ కేవలం 72 స్థానాల్లో మాత్రం ఆధిక్యంలో ఉండగా ఇతరులు కూడా తమ ప్రభావాన్ని చూపుతు తాజాగా అందిన సమాచారం మధ్యప్రదేశ్ మేరకు 2 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.

    చత్తీస్ గఢ్ : రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 2స్థానాల్లో ఉన్నారు.

    రాజస్థాన్ : 199 స్థానాలకు బీజేపీ 109 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇతరులు కూడా తమ ప్రతాపాన్ని చూపుతున్నారు రాజస్థాన్ లో ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

  • 03 Dec 2023 11:41 AM (IST)

    కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహించారు : నితిన్ నబిన్

    ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని.. అందుకే ప్రజలు బీజేపీని నమ్ముతున్నారని బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే..ఛత్తీస్ గఢ్ బీజేపీ కో ఇన్ చార్జ్ నితిన్ నబిన్ అన్నారు. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అన్నారు.

     

  • 03 Dec 2023 11:30 AM (IST)

    జైపూర్‌లో కమలం నేతల సంబరాలు

    రాజస్థాన్ లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 114 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో రాజస్థాన్ బీజేపీలో నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. జైపూర్ లో బీజేపీ నేతలు డ్యాన్సులు చేస్తు తన ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు.

     

  • 03 Dec 2023 11:25 AM (IST)

    మూడు రాష్ట్రాల్లో బీజేపీ హవా..గుజరాత్‌లో సంబరాలు

    మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో గుజరాజ్ తో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలు బీజేపీ జెండాలు ప్రదర్శిస్తు డ్యాన్సులు చేస్తు తమ ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు.

     

     

  • 03 Dec 2023 11:02 AM (IST)

    రాజస్థాన్ లో కాంగ్రెస్ ను అవే దెబ్బకొట్టాయా..?

    అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ వైఫల్యం, పార్టీలో అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి. దీంతో రాజస్థాన్ లో బీజేపీ కాంగ్రెస్ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది.  రాజస్థాన్ లో విజయం దిశగా దూసుకుపోతోంది. దీంట్లో భాగంగానే మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసి ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలుండగా బీజేపీ 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు ఇతరులు కూడా తమ ప్రభావాన్ని చూపుతున్నారు.

  • 03 Dec 2023 10:56 AM (IST)

    తెలంగాణ తప్ప .. మూడు రాష్ట్రాల్లో బీజేపీ హవా..

    ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తెలంగాణ, చత్తీస్ ఘడ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్ నాలుగు రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ లో కాంగ్రెస్ తెలంగాణ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో చతికిలబడుతున్న పరిస్థితుల్లో ఉంది. తెలంగాణలో మొత్తం 199 స్థానాలకు కాంగ్రెస్ 65 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ మాత్రం 40 ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితంగా ఉంది. అలాగే ఎంఐఎం 3 స్థానాల్లోను ఇతరులు 1 స్థానంలోనే ఆధిక్యంలో ఉన్నారు.

    చత్తీస్ ఘడ్ : బీజేపీ 48, కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.ఇతరులు 2 స్థానాల్లో ఉన్నారు.
    రాజస్థాన్ : బీజేపీ 108, కాంగ్రెస్ 75 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నారు..
    మధ్యప్రదేశ్ : బీజేపీ 161, కాంగ్రెస్ 65 స్థానాల్లో ఉండగా ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 03 Dec 2023 10:47 AM (IST)

    బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు : అరుణ్‌సావో

    ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ హవా తగ్గుతోంది. బీజేపీ కాంగ్రెస్ కు గట్టి పోటీనిస్తోంది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కూడా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో ఉంది. దీంతో బీజేపీ మూడు రాష్ట్రాల్లోను విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. దీంట్లో భాగంగానే..ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌సావో మాట్లాడుతూ.. ‘ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు బీజేపీని ఆశీర్వాదించబోతున్నారని అన్నారు. ఇవ్వబోతున్నారు.. రాష్ట్రమంతా తాను తిరిగానని..ఆ నమ్మకంతోనే చెబుతున్నా.. ఛత్తీస్ గడ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది అని అన్నారు. పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలిపారు.

     

  • 03 Dec 2023 10:38 AM (IST)

    150 సీట్లు మావే ..మూడు రాష్ట్రాల్లో విజయం మాదే : హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా

    మధ్యప్రదేశ్ లో బీజేపీ 125 నుంచి 150 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నేత మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. మధ్యప్రదేశ్ లోనే కాదు రాజస్థాన్,ఛత్తీస్ గఢ్ లలో కూడా బీజేపీదే విజయం అన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.199 స్థానాలకు స్థానాలకు బీజేపీ బీజేపీ 125 నుంచి 150 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

  • 03 Dec 2023 10:22 AM (IST)

    3.0తో బీజేపీ విజయం : జైవీర్ షెర్గిల్

    ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే అత్యధిక విజయం అని బీజేపీ నేత జైవీర్ షెర్గిల్ ధీమా వ్యక్తంచేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తున్న తరుణంలో ఆయన మాట్లాడుతు..ఈ ఎన్నికల్లో బీజేపీ 3-0తో గెలుస్తుందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లతో పాటు ఛత్తీస్ గఢ్ లో కూడా బీజేపీయే విజయం సాధిస్తుందని అన్నారు. తెలంగాణలో ఈసారి కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా బీజేపీ విజయం సాధించి తీరుతుందని అన్నారు. కాగా..ఈరోజు మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఛత్తీస్ గఢ్, తెలంగాణలో ఓట్లు కౌంటింగ్ కొనసాగుతోంది. మిజోరాం ఓట్ల లెక్కింపు వాయిదా పడింది.రేపు జరగనుంది.

     

  • 03 Dec 2023 10:04 AM (IST)

    మధ్యప్రదేశ్,రాజస్థాన్ లో బీజేపీ ఆధిక్యం..

    ఛత్తీస్ గడ్ : 90 స్థానాలకు కాంగ్రెస్ 58, బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యం
    రాజస్థాన్ : 199 స్థానాలకు కాంగ్రెస్ 80 స్థానాలు, బీజేపీ 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇతరులు 15 స్థానాల్లో ఉన్నారు.
    మధ్యప్రదేశ్ : 230 స్థానాలకు కాంగ్రెస్ 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..బీజేపీ 130 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు.

  • 03 Dec 2023 09:49 AM (IST)

    రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గడ్‌లో నువ్వా నేనా అన్నట్లుగా హస్తం, కమలం

    మధ్యప్రదేశ్ బీజేపీ హవా కొనసాగుతుంటే..ఛత్తీస్ గడ్, రాజస్థాన్ లో కాంగ్రెస్,బీజేపీలు నువ్వా..? నేనా..? అన్నట్లుగా  హవా కొనసాగిస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో భాగంగా కాంగ్రెస్ ఓ సారి ఆధిక్యంలో ఉంటే..మరోసారి బీజేపీ బీట్ చేస్తోంది. ఛత్తీస్ గడ్ లో మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 36 స్థానాల్లో ఉంది. అలాగే మధ్యప్రదేశ్ లో 230 స్థానాలు ఉండగా బీజేపీ 130, కాంగ్రెస్ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్ లో 199 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 82 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 03 Dec 2023 09:39 AM (IST)

    ఛత్తీస్‌గడ్‌లో లీడ్‌లో కాంగ్రెస్

    ఛత్తీస్‌గడ్‌ లో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 90 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 51 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుండగా బీజేపీ 37 స్థానాల్లో ఉంది.

  • 03 Dec 2023 09:31 AM (IST)

    గెలుస్తాం..

    మధ్యప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్బంగా మాకు గెలుపుపై ఫుల్ క్లారిటీ ఉంది. మధ్యప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకునేలా ఆలోచిస్తున్నారని..కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ ధీమా వ్యక్తంచేశారు. ఎన్ని సీట్లు వస్తాయనే టెన్షన్ మాకు లేదని ప్రజలు కాంగ్రెస్ ను గెలిస్తారనే నమ్మకముంది అని అన్నారు.

     

  • 03 Dec 2023 09:26 AM (IST)

    ఝలర్‌పటన్‌లో వసుంధర రాజే ఆధిక్యం..

    రాజస్థాన్ లో నువ్వా నేనా అంటున్న కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ఈక్రమంలో ఝలర్‌పటన్‌లో వసుంధర రాజే 5,000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • 03 Dec 2023 09:13 AM (IST)

    గెలుపు మాదే..మధ్యప్రదేశ్ లో బీజేపీ ధీమా..

    ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని..చరిత్ర సృష్టిస్తుందని..మధ్యప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ ధీమా వ్యక్తంచేశారు. మోదీతోనే అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు.

     

  • 03 Dec 2023 09:10 AM (IST)

    జైపూర్‌లో నువ్వా.. నేనా అన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్..

    జైపూర్‌లో 4 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి..

  • 03 Dec 2023 09:04 AM (IST)

    రాజస్థాన్ లో పోటా పోటీగా..బీజేపీ, కాంగ్రెస్..

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటిగ్ లో ప్రారంభంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 55 స్థానాల్లో, కాంగ్రెస్ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలు ఉండగా..ఓట్ల కౌంటింగ్ ప్రారంభంలోనే బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి.

  • 03 Dec 2023 08:36 AM (IST)

    జోధ్‌పూర్‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు

    రాజస్థాన్ శాసనసభ ఓట్ల లెక్కింపుకు ముందు జోధ్‌పూర్‌లోని కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉన్నారు.

  • 03 Dec 2023 08:21 AM (IST)

    మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్ లో అధికారం ఎవరిదో..

    ఉదయం 10 :30 కల్లా ఆధిక్యం వివరాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. కాగా, ఒక్క మిజోరాం మినహా మిగిలిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి.మధ్యాహ్నం లోపే అధికారం ఎవరిదనే విషయంపై క్లారిటీ రానుంది. కాగా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా తలపడనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్తున్నాయి.కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, రాష్ట్ర కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.