Madhya Pradesh : కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి భోపాల్ లోని షాపురా ఏరియాలో ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్ నివాసంలో 38ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది.

Madhya Pradesh : కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య

Madhya Pradesh

Updated On : May 17, 2021 / 8:28 PM IST

Madhya Pradesh మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి భోపాల్ లోని షాపురా ఏరియాలో ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్ నివాసంలో 38ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది. సంఘటన స్థలంలో మృతురాలు రాసినట్లుగా ఉన్న ఓ సూసైడ్‌ ను స్వాధీనం చేసుకున్నామని.. సింఘర్‌ జీవితంలో నాకు చోటు లేదని అర్థం అయ్యింది.. అందుకే నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను అని ఆ సూసైడ్ నోట్ లో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంబాలాకి చెందిన మృతురాలు.. ఏడాది నుంచి భోపాల్ లోని ఎమ్మెల్యే సింఘర్‌కు వస్తుండేదని పోలీసులు తెలిపారు. ఏడాది కాలంగా ఆమెకు, ఎమ్మెల్యే సింఘర్‌కు పరిచయం ఉందని… గత 25-30 రోజులుటగా ఆమె ఎమ్మెల్యే నివాసంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

అడిషనల్ ఎస్పీ రాజేష్‌ సింగ్‌ భదోరియా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే భవనంలో ఓ పనిమనిషి, అతడి భార్య నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పనిమనిషి భార్య, మృతురాలు నిద్రిస్తున్న గది తలుపు తట్టి చూడగా.. ఎలాంటి స్పందన లేదు. దాంతో వెంటనే పనిమనిషి ఈ విషయాన్ని ఎమ్మెల్యే సింఘర్‌కు తెలిపాడు. ఇక ఎమ్మెల్యే సూచనల మేరకు పనిమనిషి గదిలోకి వెళ్లి చూడగా.. అ‍క్కడ సదరు మహిళ వేలాడుతూ కనిపించింది అన్నారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే సింఘర్‌ మాట్లాడుతూ.. ఇది హృదయ విదారక సంఘటన. చనిపోయిన మహిళ నాకు మంచి స్నేహితురాలు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటుందని నాకు తెలియదు. గత రెండు రోజులుగా నేను భోపాల్‌లో లేను. ఇక పోలీసులు ఆమె వద్ద నుంచి అంబాలా, భోపాల్‌ ఆస్పత్రులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లను కనుగొన్నారు. ఇక సదరు మహిళ అనారోగ్యం గురించి నాకు ముందే తెలిసి ఉంటే.. మంచి చికిత్స ఇప్పించేవాడిని. ఇలా జరగకుండా చూసేవాడినని తెలిపారు.