CM కమల్‌నాథ్‌కు పదవీ గండం..ప్రభుత్వం ఏర్పాట్లుకు బీజేపీ వ్యూహాలు: ఎంపీలో ఏం జరుగుతోంది?! 

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 04:10 AM IST
CM కమల్‌నాథ్‌కు పదవీ గండం..ప్రభుత్వం ఏర్పాట్లుకు బీజేపీ వ్యూహాలు: ఎంపీలో ఏం జరుగుతోంది?! 

Updated On : March 10, 2020 / 4:10 AM IST

మధ్యప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కోసం బీజేపీ కాచుకుని కూర్చున్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. రాష్ట్రంలో తలెత్తిని రాజకీయ సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి పావులు కదుపుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా సీఎం కమల్ నాథ్ తన మంత్రివర్గాన్ని రద్దు చేశారు. నూతన మంత్రి వర్గ ఏర్పాటుపై కమల్ నాథ్ కసరత్తులు చేస్తున్నారు.

జ్యోతిరాదిత్యా సింధియా తిరుగుబాటు బావుటా ఎగురవేయటంతో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు వచ్చాయి. దీంతో రెబల్ గా మారిని  సింధియా వర్గానికి చెందిన 17మంది ఎమ్మెల్యేలతో రెబల్ ఎమ్మెల్యేలతో కమల్‌‌‌నాథ్‌తో సహా ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ఓ రిసార్ట్స్ లో సంప్రదింపులు జరిపేందుకు యత్నిస్తున్నారు.  

కాంగ్రెస్ కు తలెత్తిన ఈ పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో శివరాజ్ సింగ చౌహాన్ ఢిల్లీనుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చేరుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిని..జరుగుతున్న పరిణామాలకు ఎప్పటి కప్పుడు బీజేపీ అధిష్టానికి తెలియజేస్తున్నారు. జేపీ నడ్డా..అమిత్ షాకు వివరిస్తున్నారు.  

సీఎం కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ యత్నిస్తోందనీ..దాని కోసమే బీజేపీ కాచుకుని కూర్చోందనే అంశంపై శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆసక్తి బీజేపీకి లేదని ఆయన తెలిపారు. రాజకీయ సంక్షోభం తలెత్తితే దానికి తాము చేసేదేమీ లేదని, అది పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, దానిపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. ప్రభుత్వం కూల్చే ఉద్దేశం తమకు లేదనిపైకి చెబుతూనే వెనుక పావులు కదుపుతోంది బీజేపీ. 

ప్రస్తుతం సింధియా వర్గానికి చెందిన 17మంది ఎమ్మెల్యేలతో కమల్ నాథ్ సంప్రదింపులకు యత్నిస్తున్న క్రమంలో సింధియాను..ఆయన వర్గాన్ని బీజేపీలోకి లాగేందుకు శివరాజ్ సింగ్ యత్నిస్తున్నారు. దీనిపై బీజేపీ నేత నారోత్తమ్ మాట్లాడుతూ సింధియా బీజేపీలో చేరాలనుకుంటే తప్పకుండా ఆహ్వానిస్తామని తెలిపారు.  అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం వచ్చిన సంక్షోభ పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నట్లేగా..పైకి మాత్రం కమల్ నాథ్ తో సింధియా వర్గ ఎమ్మెల్యేలు చేరితే మరోసారి కాంగ్రెస్ సంక్షోభం సమస్య తీరిపోతుంది.దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం గట్టిపడుతుంది. దీంతో బీజేపీ అనుకున్నది జరగదు. అందుకే సింధియాతో కమల్ నాథ్ సంప్రదింపులకు యత్నిస్తున్న క్రమంలో సింధియాను..ఆయన ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగటానికి శివరాజ్ సింగ్ ఢిల్లీ నుంచి భోపాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 

కాగా.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సోమవారం (మార్చి 9,2020)అర్ధరాత్రి సుమారు 20 మంది కేబినెట్ మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సమర్పించారు. వాటిని కమల్‌నాథ్ ఆమోదించారని, మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమల్‌నాథ్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల ఆరోపణలు చేశారు. 

కానీ పరిస్థితి ఇంకా తమ చేతుల్లోనే ఉంది అనుకున్న కమల్ నాథ్ ప్రభుత్వానికి ఈ రోజు అనుకోని గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. మధ్యప్రదేశ్ లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. పూటకో మలుపు తిరుగుతూ అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. భోపాల్ నుంచి మూడు ప్రత్యేక చార్డ్ట్ ఫ్లైట్‌లో రెబల్ గా మారిన ఎమ్మెల్యేలను (వీరులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు.) జాగ్రత్తగా బెంగళూరు తరలించినట్లు సమాచారం. దీనితో ఇప్పుడు కమల్ నాథ్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఇంతమంది ఒక్కసారిగా పార్టీకి దూరంగా వ్యవహరిస్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందా?లేదా? దీన్ని బీజేపీ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

అయితే ఈ మొత్తం వ్యూహానికి కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియానే కారణమన్నట్లు సమాచారం. సర్కార్ లో ఇంత గందరగోళం జరుగుతున్నప్పటికీ ఆయన దేశ రాజధాని ఢిల్లీ లోనే ఉండిపోవడం విశేషం. అంతేకాకుండా ఈ 18 మందిలో అత్యధికులు ఈయన వర్గం వారే కావడంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణం అని కాంగ్రెస్లోని ఒక వర్గం తీవ్రంగా ఆరోపిస్తుంది. మరోపక్క ఎప్పుడు అధికార పీఠం దక్కించుకోవాలా అని ఆత్రంగా చూస్తున్న బీజేపీ..గోతికాడ నక్కలా కాచుకుని కూర్చుని కాంగ్రెస్ కు వచ్చిన సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని గద్దెనెక్కాలను తనదైన శైలిలో ఎత్తులు వేస్తోంది.

 సభలో కమల్ నాథ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రలో ఏర్పడిన ఈ సంక్షోభంపై సీఎం కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయి చర్చించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కమల్ నాథ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే తన పదవిని కాపాడుకోగలరనీ..లేదంటే బీజేపీ దెబ్బకొట్టే ప్రమాదం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

See Also | రూ.11,234 కోట్ల విరాళాలు వసూలు చేసిన రాజకీయ పార్టీలు