ఎన్నికల విక్రమార్కుడు : 16సార్లు ఓడినా మళ్లీ పోటీకి రెడీ  

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 07:25 AM IST
ఎన్నికల విక్రమార్కుడు : 16సార్లు ఓడినా మళ్లీ పోటీకి రెడీ  

మధురై : ఒక్కసారి..రెండు సార్లు..లేదా మూడుసార్లు..ఇంకా కాకుంటే నాలుగు సార్లు ఇలా వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే వారేంచేస్తారు? ఇదేంటిరా బాబూ అని విసుగు వచ్చి పోటీ నుంచి విరమించుకుంటారు. కానీ మన ఎన్నికల విక్రమార్కుడు మాత్రం పట్టు వదల కుండా పోటీ చేస్తునే వున్నాడు..ఓడిపోతునే ఉన్నాడు. కానీ పోటీ చేయటం మాత్రం  విరమించుకోవటంలేదు. ఆయనే ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన ఫక్కడ్ బాబా. 
 

ఓటమిపాలయ్యే రాజకీయ అభ్యర్థిగా ఫక్కడ్ బాబా గుర్తింపుపొందారు. ఇప్పటివరకూ ఆయన 16 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఎప్పుడూ గెలవనేలేదు. అయినా ఆయన నిరుత్సాహపడటంలేదు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ పోటీకి రెడీ అయిపోయారు. ఇన్నిసార్లు ఓడిపోయినా తనలో మళ్లీ పోటీ చేయాలనే ఉత్సాహం లభించడం వెనుక తన గురువు ఉన్నారని ఆయన చెబుతుంటారు బాబా.

1976 నుంచి ఫక్కడ్ బాబా లోక్‌సభ..అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మధుర లోక్‌సభ సీటుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 8 సార్లు లోక్‌సభ, 8 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకూ పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన శిష్యులు, మద్దతుదారులు తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ. 25 వేల ఆర్థికసాయం కూడా  అందించారని తెలిపారు.