Election Results : మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి.. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి హవా.. వయనాడ్‌లో ప్రియాంక ఘన విజయం
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Maharashtra Jharkhand Election Results
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
LIVE NEWS & UPDATES
-
ఈ గెలుపు అదానీ, అంబానీదే: వీహెచ్
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలుపుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాది కాదని ఆయన అన్నారు. ఈ విజయం అగ్ర వ్యాపారులైన అదాని, అంబానీదేనని ఆరోపించారు.
-
మహాయతి కూటమి నేతలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభాకాంక్షలు తెలిపారు.
-
చెన్నపట్టణం నియోజకవర్గం ఉప ఎన్నికలో నిఖిల్ కుమారస్వామి ఓటమి చెందారు.
-
వయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. ఆమె ఇప్పటి వరకు 3,98,839 ఓట్లు మెజార్టీని సాధించారు.. పూర్తి మెజార్టీ వివరాలు తెలియాల్సి ఉంది.
-
ఆ ముగ్గురు నేతలను అభినందించిన అమిత్ షా..
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయం దిశగా దూసుకెళ్తుంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో విజయం నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లకు ఫోన్లు చేసి అభినందనలు తెలిపారు.
-
వయనాడ్ లో 3లక్షలు దాటిక ప్రియాంక గాంధీ ఆధిక్యం
-
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్..
దేశ వ్యాప్తంగా వయనాడ్, నాందేడ్ లోక్ స్థానాలకు, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు.
నాందేడ్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
యూపీలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
బీహార్ రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది.
కేరళ పాలక్కడ్ లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
రాజస్థాన్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
-
మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపు ఖాతా తెరిచింది. వడాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాళిదాస్ నీలకంఠ్ విజయం సాధించారు. 59,764 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు.
-
వయనాడ్ లో 2,09,173 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ.
రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరీ.
మూడో స్థానంకు పరిమితమైన బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ బాధ్యతలు స్వీకరిస్తారు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతుంది. మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థులు 127 స్థానాల్లో, శివసేన (షిండే) అభ్యర్థులు 55, ఎన్సీపీ (అజిత్ పవార్) అభ్యర్థలు 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ పేర్కొన్నారు. కాసేపట్లో ఫడణవీస్ తో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వాంఖలే భేటీ కానున్నారు.
-
విజయం దిశగా ప్రియాంక గాంధీ.. రేవంత్ ట్వీట్
వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి మంచి ఆధిక్యం లభిస్తోందని, ఆమె భారీ మెజార్టీతో పార్లమెంట్ లోకి అడుగుపెట్టడం ఖాయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీకి రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని రేవంత్ పేర్కొన్నారు.
An amazing first trend on counting day is the massive early lead for our leader @priyankagandhi ji in Wayanad, Kerala, by-election.
People of Wayanad are surely going to record in victory margins today and Priyanka ji will make Parliamentary debut with a grand win.…
— Revanth Reddy (@revanth_anumula) November 23, 2024
-
ఇది ప్రజా తీర్పు కాదు.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు - సంజయ్ రౌత్
మహారాష్ట్ర ఫలితాలపై శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజా తీర్పు కాదు.. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో మాకు స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. ఇప్పుడెలా ఫలితాలు మారాయని ఆయన ప్రశ్నించారు.
-
మహారాష్ట్రంలో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతుంది..
తాజా ఫలితాల ప్రకారం.. ఎన్డీయే కూటమి 211 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
బీజేపీ 131 స్థానాల్లో, శివసేన (షిండే) 48, ఎన్సీపీ (అజిత్ పవార్) 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.ఇండియా కూటమిలో కాంగ్రెస్ 31 స్థానాల్లో, శివసేన (ఉద్ధవ్) 20 స్థానాల్లో, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
2014లో మహారాష్ట్రలో బీజేపీ అధిక్యంగా 122 సీట్లు గెలుచుకుంది. అయితే, ప్రస్తుతం ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు 131 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
జార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన జేఎంఎం కూటమి..
జార్ఖండ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81.
మ్యాజిక్ ఫిగర్ 41.
ప్రస్తుతం జార్ఖండ్ లో జేఎంఎం కూటమి అభ్యర్థులు 43 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఎన్డీయే కూటమి అభ్యర్థులు 35 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
వయనాడ్ లో ప్రియాంక హవా
89,191 ఓట్ల ఆధిక్యం.
రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మెకరీ
మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్
-
పశ్చిమ బెంగాల్‌లో..
మదారిహట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి జయప్రకాష్ టోప్పో ఆధిక్యంలో ఉన్నారు.
నైహతి అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీకి చెందిన సనత్ దే ముందంజలో ఉన్నారు.
-
మహారాష్ట్ర ఫలితాలు..
వర్లి నియోజకవర్గంలో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆధిత్య థాక్రే ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బారామతిలో అజిత్ పవార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కార్జాత్ లో శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నాగపూర్ లో ఫడ్నవీస్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
జార్ఖండ్ లో సారైకాలేలో ఆధిక్యంలో మాజీ సీఎం చంపై సోరెన్.
జార్ఖండ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని చంపై సోరెన్ అన్నారు.
సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
-
జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ కూటమి, జేఎంఎం కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. తాజా ఫలితాల ప్రకారం.. జేఎంఎం కూటమి అభ్యర్థులు 35 స్థానాల్లో, బీజేపీ కూటమి అభ్యర్థులు 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
-
వయనాడ్ లో ప్రియాంక గాంధీ 46వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు..
సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
వయనాడ్ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్న ప్రియాంక.
-
కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కొలబా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు బాంద్రా ఈస్ట్ లో బాబా సిద్ధిఖీ తనయుడు ఎన్సీపీ అభ్యర్థి జీషాన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తొమ్మిది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కూటమి ఆరు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎస్పీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
-
వయనాడ్ నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే 3776 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో విజయం ఖాయమని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేసుకునేందుకు మిఠాయిలను సిద్ధం చేస్తున్నారు.
-
వయనాడ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పై 460 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
మహారాష్ట్రలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల సంతకాలను డిజిటల్ రూపంలో ముందే సేకరిస్తున్న విపక్ష కూటమి.
-
మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. రెండు చోట్ల బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో జార్ఖండ్‌లో బీజేపీ 20 స్థానాల్లో, జేఎంఎం కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.