మహారాష్ట్ర ప్రజలు కిచిడీ ప్రభుత్వాన్ని కోరుకోలేదు : సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 

  • Published By: chvmurthy ,Published On : November 23, 2019 / 04:07 AM IST
మహారాష్ట్ర ప్రజలు కిచిడీ ప్రభుత్వాన్ని కోరుకోలేదు : సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 

Updated On : November 23, 2019 / 4:07 AM IST

మహారాష్ట్రలో నెలరోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మిత్రపక్షమైన శివసేనకి షాకిచ్చి, ఎన్సీపీతో కలిసి బీజేపీ శనివారం ఉదయం  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ప్రజలు  సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని, కిచిడీ ప్రభుత్వాన్ని కోరుకోలేదని, శివసేనను ఉద్దేశించి సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వ్యాఖ్యానించారు.

ప్రజలు బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చారని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత  శివసేన ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసేందుకు  ప్రయత్నించటంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని అన్నారు  ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకు  బీజీపీతో కలిసి పనిచేసేందుకు అజిత్ పవార్ అంగీకరించారని ఫడ్నవీస్ తెలిపారు.